Begin typing your search above and press return to search.

ముంద‌స్తు రేసులో ప‌వ‌న్ ప‌రిస్థితేంటి?

By:  Tupaki Desk   |   7 Sep 2018 10:01 AM GMT
ముంద‌స్తు రేసులో ప‌వ‌న్ ప‌రిస్థితేంటి?
X
అనిశ్చితికి కేరాఫ్ అడ్ర‌స్ గా క‌నిపిస్తారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. రాజ‌కీయాల్లో ఏం ఉండ‌కూడ‌దో అలాంటి గుణాల‌న్నీ పుణికి పుచ్చుకున్న ర‌త్నంగా ప‌వ‌న్ ను చెప్పాలి. ప్ర‌జ‌ల‌తో నిత్యం మ‌మేకం కావ‌టం.. లేదంటే కేసీఆర్ మాదిరి ప్ర‌జ‌ల‌తోనే అయిన‌ట్లుగా అప్పుడ‌ప్పుడు వ‌చ్చి హ‌డావుడి చేయ‌టం ఉండాలి. కానీ.. ఈ గుణాలేవీ ప‌వ‌న్ లో క‌నిపించ‌వ‌ని చెబుతారు.

ఎవ‌రికి అందుబాటులో ఉండ‌న‌ట్లుగా ఉంటూనే.. భారీ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకొని వ‌చ్చి.. పార్టీ క్యాడ‌ర్ మొద‌లు అధికార‌ యంత్రాన్ని ప‌రుగులు పెట్టించే కేసీఆర్‌.. త‌న‌కు న‌చ్చిన రీతీలో రాజ‌కీయాల్ని సైతం ఉరుకులు ప‌రుగులు పుట్టించే సామ‌ర్థ్యం ఆయ‌న సొంతం.

ఇలాంటివేమీ లేని ప‌వ‌న్ ప‌రిస్థితి ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఓప‌క్క టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముంద‌స్తు రేసులో దూసుకెళుతున్న వైనం తెలిసిందే. ముంద‌స్తుకు వెళుతున్న‌ట్లుగా కేసీఆర్ ప్ర‌క‌టించి 24 గంట‌లు దాటుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ అన్ని పార్టీలు స్పందించినా జ‌న‌సేన పార్టీ మాత్రం మౌనంగా ఉంది.

ఈ మ‌ధ్య‌న ఒక ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ అలాంటి ప‌రిస్థితే ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ తెలంగాణ‌లో పార్టీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.,

మ‌రి.. గ‌తంలో తాను చెప్పిన మాట‌ల‌కు భిన్నంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారా? పోటీకి దూరంగా ఉంటారా? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్లుగా మారాయి. ముంద‌స్తుపై కేసీఆర్‌కీల‌క నిర్ణ‌యం తీసుకొని.. 105 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా ప‌వ‌న్ నుంచి ఎలాంటి స్పంద‌న లేదంటే ఆయ‌న ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌రా? అన్న సందేహం క‌లుగుతోంది. రాజ‌కీయ వ‌ర్గాల అభిప్రాయాన్ని చూస్తే కూడా.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ తెలంగాణ‌లో పోటీ చేయ‌కుండా ఉండ‌టం ఉత్త‌మం అంటున్నారు.

ఎలాంటి క్యాడ‌ర్ లేకపోవ‌టం.. పార్టీ నిర్మాణం ప్రాధ‌మికంగా కూడా పూర్తికాని వేళ‌.. ఎన్నిక‌ల బ‌రిలో దిగితే దారుణ‌మైన ఫ‌లితాలు రావ‌టం ఖాయ‌మంటున్నారు. అదే జ‌రిగితే.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఏపీలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. ప‌వ‌న్ మౌనం చూస్తుంటే.. ఈసారికి తెలంగాణ ఎన్నిక‌ల రేసులో జ‌న‌సేన దూరంగా ఉండే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న మాట వినిపిస్తోంది.