Begin typing your search above and press return to search.
కొత్త ముఖాలు కనపడవా..జనసేనలో వింత పరిస్థితి!
By: Tupaki Desk | 25 Jan 2019 3:52 PM GMTఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొద్ది నెలల్లోనే ఏపీ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబు వరాల జల్లును కురిపిస్తూ మళ్లీ అధికారమే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. ఇక, ప్రతిపక్ష నేత జగన్ కూడా సుదీర్ఘ పాదయాత్రను ముగించుకుని బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. జంపింగ్ నేతల హడావుడి ఎలాగూ ఉండనే ఉంది. ఇదీ ప్రస్తుతం ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితి. ఇదిలా ఉంటే - ఏపీలో టీడీపీ - వైసీపీ పార్టీలతో పాటు ఎన్నికల బరిలో నిలవబోతున్న పార్టీ జనసేన. పవన్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలవడానికి సిద్ధంగా ఉన్న ఈ పార్టీ సంస్థాగతంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదనేది రాజకీయ విశ్లేషకుల వాదన.
సినీ నటుడు పవన్ కల్యాణ్ సారథ్యంలో నడుస్తున్న ఈ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ సభలకు జనాదరణ ఉందని, అందులో ఎలాంటి సందేహం లేదని.. కానీ ఆ జనాన్ని పోలింగ్ బూత్ ల వరకూ నడిపించగల స్థానిక నాయకత్వం ఎంతవరకూ ఉందనే ప్రశ్న జనసేనను వెంటాడుతోంది. జనసేన పార్టీకి కర్త - కర్మ - క్రియ అన్నీ పవన్ కల్యాణే అనే వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పవన్ తో పాటు జనసేనలో కొత్తగా ఎవరైనా కనిపిస్తున్నారంటే అది ఒక్క నాదెండ్ల మనోహర్ మాత్రమే. వీరిద్దరినీ మినహాయించి జనసేనలో కీలక పాత్ర పోషించేందుకు ద్వితీయ శ్రేణి నేతలే కరువయ్యారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు - ఇటీవలే పార్టీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను మినహాయిస్తే చెప్పుకోదగ్గ నేతలెవరూ పార్టీలో లేరని.. ద్వితీయ స్థాయి నేతలెవరనే ప్రశ్నకు ప్రస్తుతం జనసేనలో సమాధానం దొరకని పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. ఎన్నికలు మరికొద్ది నెలల్లో ఉండగా.. ద్వితీయ స్థాయి నేతలను - తమ కార్యకర్తలను సమన్వయపరచి విజయం దిశగా అడుగులేయటం అంత తేలికైన పని కాదని - జనసేన అధికారంలోకి రావాలంటే పవన్ కల్యాణ్‌తో పాటు ఇంకా ఏదో శక్తి కావాలని రాజకీయ పండితులు చెప్పుకొస్తున్న మాట.
పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ కేవలం ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల పైనే దృష్టిసారించడం కూడా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ తనకు తాను కులాతీతుడినని చెప్పుకొస్తున్నా.. ఆయన నిర్వహించిన సభలు ఎక్కువగా కాపు జనాభా కలిగిన ప్రాంతాల్లోనే జరగడం కొసమెరుపు. రాయలసీమలో అనంతపురం జిల్లాలో తప్ప పవన్ ఇప్పటివరకూ ఏ జిల్లాలో పర్యటించిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే గుంటూరు జిల్లాపై దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 27న గుంటూరు జిల్లాలో పవన్ బహిరంగ సభ జరగనుంది.
అయినప్పటికీ.. జనసేనను క్షేత్రస్థాయిలో బలపరిచేందుకు ప్రస్తుతం చెప్పుకోదగ్గ నేతలెవరూ లేకపోవడంతో పవన్ కల్యాణ్‌పై పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని.. రాష్ట్రవ్యాప్తంగా పవన్ విస్తృతంగా పర్యటించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన బలపడని పక్షంలో 2019లో ఆ పార్టీకి ఆశించదగ్గ ఫలితాలు దక్కే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు. వచ్చే వంద రోజులను సక్రమంగా పవన్ వినియోగించుకోగలిగితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశమూ లేకపోలేదని మరికొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద.. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న జనసేనకు వచ్చే వందరోజులు కీలకంగా మారనున్నాయన్నమాట.