Begin typing your search above and press return to search.
జంపింగ్‌ల జనసేన - 115 జంపింగ్ లకు సీట్లు !
By: Tupaki Desk | 5 Jan 2019 11:47 AM GMTమాది యువరక్తం. రాజకీయాలను మారుస్తాను. కొత్త చరిత్ర సృష్టిస్తాను. రాజకీయ కంపును కడిగేస్తాను... నవ సమాజాన్ని నిర్మిస్తాను... ఈ కబుర్లన్నీ చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మాటలన్నీ విన్నవారు... 1983లో ఎన్టీఆర్ లాగా అందరికీ కొత్త వారికి సీట్లు ఇస్తాడేమో, కొత్త మొహాలను రాజకీయాల్లోకి తెస్తాడేమో అనుకున్నారు. కానీ చివరకు ఆయనదీ పాతబాటే. ప్రజారాజ్యం లాగే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించనున్నారు. ఇదేమీ గాసిప్ కాదండోయ్. స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పిన చెప్పిన విషయం. కాకపోతే ఆయన ఇన్ డైరెక్ట్ గా చెప్పాడంతే...
రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 175 సీట్లలో పోటీ చేస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 60 చోట్ల కొత్త వారినే బరిలోకి దింపుతామని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో సమతుల్యత (?) కోసమే అన్ని చోట్లా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అపుడేదో చిరంజీవి సామాజిక న్యాయం అనేపదం వాడారు. ఇపుడు ఈయన సమతులత్య... అంటున్నారు.
ప్రజారాజ్యంపై సంచలన వ్యాఖ్యలు
అమరావతికి వచ్చిన ప్రకాశం జిల్లా జనసేన నేతలు - కార్యకర్తలతో సమావేశమైన పవన్ అన్న పెట్టిన ప్రజారాజ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి స్ఫూర్తి గా నిలిచిన వారిలో తాను కూడా ఒకరిని అని పవన్ అన్నారు. ఓపిక లేకపోవడం వల్లే ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి అలా తయారయిందన్నారు. మరి ఓపిక చిరంజీవికి లేదా? క‌్యాడర్‌కు లేదా అన్నదానిని మనమే ఆలోచించాలి. ప్రజారాజ్యంలో చేరిన నేతలు పదవీ వ్యామోహంతో చిరంజీవిని బలహీనంగా మార్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.2,000 కోట్లు ఖర్చు చేయాలని కొందరు నాతో చెబుతున్నారని - కానీ డబ్బు అవసరం లేదని పవన్ అన్నారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి ఎదురైన అనుభవాలతోనే ఇప్పుడు జనసేనలో ఎలాంటి కమిటీలు వేయడం లేదని పేర్కొన్నారు.