Begin typing your search above and press return to search.
జనసేన కోసం పవన్ భారీ నిర్ణయం ఇది
By: Tupaki Desk | 28 Oct 2017 5:30 PM GMTజనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీ బలోపేతం కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇందులో భాగంగా పలు నిర్ణయాలు తీసుకున్న పవర్ స్టార్ దానికి కొనసాగింపుగా మరో ముందడుగు వేశారు. అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసుల ఏర్పాటుకు జనసేన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ర్టాల పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ - నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిల్లో పార్టీ ఆఫీసులు కట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతోపాటుగా జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమరావతి - హైదరాబాద్ లో నిర్మించే రాష్ట్ర కార్యాలయాలు 5 ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ రథసారథి నిర్ణయించుకున్నారు. అలాగే జిల్లాల్లో 2 ఎకరాల్లో పార్టీ ఆసీసులు ఉండేలా నిర్మించాలని నిర్ణయించింది. తెలంగాణలో పార్టీ కార్యాలయం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆఫీసుల ఏర్పాటుకు పార్టీలో ఇద్దరు ముఖ్యులకు బాధ్యత అప్పగించారు. వీలైనంత త్వరగా ఆఫీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యాలయాల నిర్వహణకు విధి విధానాల రూపకల్పన చేస్తున్నారు.
కాగా, జనసేన పార్టీకి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్ లోని సినిమా కార్యాలయంలోనే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయాన్నే పార్టీ సెంట్రల్ ఆఫీసుగా తీర్చిదిద్దేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పనులు చురుకుగా సాగుతున్నాయని జనసేన పార్టీ గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలన్నీ ఇక ఇక్కడ నుంచే సేవలు అందించనున్నాయని వివరించింది. ముఖ్యంగా ఐటీ విభాగాన్ని విస్తృత పరుస్తున్నారని ప్రకటించిది. మరో కొద్ది రోజులలో ఈ పనులన్నీ ముగియనున్నాయని తెలిపింది. మరోవైపు అమరావతి సహా జిల్లాల్లోని కార్యాలయాలపై కూడా దృష్టి సారించడం గమనార్హం.