Begin typing your search above and press return to search.
పవన్ రాకపోయినా పవర్ కనిపించింది
By: Tupaki Desk | 7 Jan 2016 11:39 AM GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చి బలంగా నిలదొక్కుకున్న టీఆరెస్ పార్టీ ఏడాదిన్నరగా ఎదురే లేకుండా సాగుతోంది. కాంగ్రెస్ కాడి పక్కన పడేసింది. టీడీపీ కూడా చూసీచూడనట్లుగా ఉంటోంది. దీంతో తెలంగాణలో టీఆరెస్ ఎదురులేని పార్టీగా ఉంది. సార్వత్రిక ఎన్నికల తరువాత వచ్చిన అన్ని ఎన్నికల్లో జోరు చూపిస్తూ ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేసింది. పార్టీ దూకుడుగా ఉండడంతో టీఆరెస్ నేతలూ దూకుడుగా ఉంటున్నారు. అలా ఫుల్ కాన్ఫిడెన్సుతో ఉన్న టీఆరెస్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ గెలుపుపై నమ్మకంతో ఉన్నా తాజా పరిణామాల పట్ల ఆందోళన చెందుతోంది. కాంగ్రెస్ సీనియర్లకు, మాస్టర్ మైండ్ చంద్రబాబుకు, కీలక పార్టీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కు కూడా భయపడని టీఆరెస్ ఇప్పుడు ఒకే ఒక్కడిని చూసి వణుకుతోంది.
అందుకే ఆయన ప్రచారానికి వస్తున్నారు అన్న ప్రచారం మొదలుకాగానే ఆయనపై ఎదురుదాడి ప్రారంభించింది. ఆయన అసలు ప్రచారానికి వస్తారో రారో తెలియదు కానీ, టీఆరెస్ మాత్రం ముందే ఆయనపై విమర్శల దాడికి తెరతీసింది. అంతగా టీఆరెస్ లో భూకంపం సృష్టించిన ఆయనెవరో అర్థమైందా... ఇంకెవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో తన పార్టీ జనసేన ఎక్కడా పోటీ చేయకపోయినా బీజేపీ-టీడీపీలను తన ప్రచారంతో సేఫ్ జోన్ లో పడేసి టఫ్ ఫైట్ ను కాస్త టీడీపీ సైడ్ తీసుకొచ్చారని ఫస్ట్ ఇమేజి సాధించుకున్న పవన్ ఇప్పుడు టీఆరెస్ ను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఆయనకు యువతలో ఉన్న ఆదరణ, ఆయన ప్రసంగాల్లో పదును నగర యువతను అట్రాక్ట్ చేసే ప్రమాదముందని టీఆరెస్ అంచనా వేస్తుంది. బొటాబొటీగా విజయం సాధిస్తామని భావిస్తున్న ఆ పార్టీ ఇప్పుడు పవన్ ఏమాత్రం ఓట్లను లాక్కుపోయినా కూడా తాము గెలవడం కష్టమని డిసైడైపోయింది. అందుకే ఆయన వస్తారట అని వినిపించగానే స్పీడు పెంచేసింది.
దీంతో పవన్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ ఆయన నాకెందుకీ గొడవ... నా పార్టీ ఏమైనా పోటీ చేస్తుందా ఏంటి అనుకునేలా చేయాలని టీఆరెస్ ప్లాన్ చేస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ తరుఫున పవర్ స్టార్ ప్రచారం చేస్తే యువత అట్రాక్టు అవుతారని భయపడుతున్న తెరాస ముందే ఆయనకు కళ్లెం వేయాలని ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగానే టీఆరెస్ నేతలు పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఈ పవన్ వ్యతిరేక దాడిని మొదలు పెట్టారు. పవన్ ది పవనిజం కాదని, అది బ్రోకరిజమని అన్నారు. ఆయన పవనిజం తెలంగాణలో పని చేయదని రవి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే సినీ నటుడు పవన్‌కల్యాన్ ఎదుగుతున్నారని... ఇక్కడి రాజకీయాల్లో వేలుబెట్టి ఆడియన్సును పోగొట్టుకోవద్దని పరోక్షంగా హెచ్చరించారు.
అయితే.... ఈ తాటాకు చప్పుళ్లకు పవన్ ఎంతవరకు బెదురుతారో తెలియదు కానీ టీఆరెస్ పవన్ ను చూసి బెదురుతోందన్న విషయం మాత్రం తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకూ అర్థమైపోయింది. ఏడాదిన్నరగా తాము చేయలేని పనిని పవన్ కసీసం సీన్లోకి ఎంటర్ కాకుండానే చేసి చూపించారని... టీఆరెస్ ను భయపెట్టారని విపక్షాలు సంబరపడుతున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఆయన వస్తారంటేనే ఇలా ఉంటే ఆయన వస్తే ఇంకెలా ఉంటోందో అంటూ ఎలాగైనా పవన్ తో ప్రచారం చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ''పవర్ స్టార్ ప్రచారానికి వస్తే వచ్చే కిక్కే వేరబ్బా'' అంటూ ఆయన కోసం ట్రై చేస్తున్నారు.