Begin typing your search above and press return to search.

మోదీని మెచ్చుకుంటూ పవన్... బంధం గట్టిదేనా...?

By:  Tupaki Desk   |   10 Sep 2022 2:30 AM GMT
మోదీని మెచ్చుకుంటూ పవన్... బంధం గట్టిదేనా...?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకున్నారు. భారతీయతను ఉట్టిపడేలా మోడీ సర్కార్ అనేక కార్యక్రమాలు చేస్తోంది అని ప్రశంసించారు. రాజ్ పధ్ పేరుని కర్తవ్య పధ్ గా మారుస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటు అలహాబాద్ కి ప్రయాగ వంటి పేరు పెట్టడం చేశారు. ఇక దేశంలో చాలా పేర్లు వలసపాలనలో ఉన్నవే కొనసాగుతుంటే వారిని మార్చిన తీరు వంటి వాటి పట్ల జనసేనాని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా పేర్లు మార్చి బ్రిటిష్ రాచరిక వ్యవస్థ మిగిల్చిన గాయలను రూపుమాపడం గొప్ప నిర్ణయం అని పవన్ పేర్కొంటున్నారు. పాత గాయాలు తుడిచే పనిలో మోడీ సర్కార్ చాలా చక్కగా పనిచేస్తోంది అని పవన్ కొనియాడారు. ప్రధాని అధికార నివాసం రేస్ కోర్స్ పేరుని లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చడం కూడా మంచి నిర్ణయం అని అన్నారు.

ఇక తాజాగా వాయుసేన పతాకంలో సెయింట్ జార్జ్ క్రాస్ స్థానంలో కొత్త పతాకాన్ని మోదీ తీసుకొచ్చారని కూడా పవన్ గుర్తు చేశారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు భేష్. ఇదే తీరున మరిన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలని పవన్ కోరారు. దానితో పాటు ఆయన మరో కోరిక కోరారు. అదేంటి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కర్తవ్య పధ్ లో ఏర్పాటు చేసిన మోడీ సర్కార్ జపాన్‌లో భద్రపరిచిన ఆ మహావీరుడి అస్తికలను కూడా భారత్ రప్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.

చూడబోతే మోడీ మీద పవన్ ప్రశంసలు బాగానే కురిపించారు. మరో వైపు చూస్తే పవన్ బీజేపీల బంధం బహు గట్టిదని కమలనాధులు చెబుతున్నారు. 2014లో మోడీ మీద పవన్ కి ఎలాంటి అభిమానం ఉందో ఇపుడు కూడా అలాగే పవన్ కొనసాగిస్తున్నారు అన్నది తాజాగా ఆయన మోడీని మెచ్చుకున్న తీరుతో అర్ధమవుతోంది.

మొత్తానికి మోడీ పాలన మీద పవన్ కి ఏ రకమైన అభ్యంతరాలు లేవు అని అర్ధమవుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఏపీలో బీజేపీతో పవన్ జనసేన ప్రయాణం ఉంటుంది అనే ఇపుడు ఈ తాజా రియాక్షన్ బట్టి అర్ధమవుతోంది అంటున్నారు. బీజేపీ కోరుకున్నట్లుగా ఏపీలో థర్డ్ ఫోర్స్ గా జనసేన బీజేపీ కూటమి వస్తుందా అంటే పవన్ లేటెస్ట్ రియాక్షన్ అయితే ఆ దిశగా హోప్స్ పెట్టుకోవచ్చు అనే చెబుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.