Begin typing your search above and press return to search.

కులపోరాటం చేయను ప్రజాపోరాటాలు చేస్తాను

By:  Tupaki Desk   |   1 Feb 2016 4:58 PM IST
కులపోరాటం చేయను ప్రజాపోరాటాలు చేస్తాను
X
జనసేన అధినేత, సినీహీరో పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమం విషయంలో తన స్టాండేమిటో స్పష్టం చేశారు. తాను కాపులు ఒక్కరికే ప్రతినిధిని కానని... సమాజంలో అందరికీ ప్రతినిధినని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టినప్పుడు కూడా అదే విషయం చెప్పానని.. కులం - మతం - ప్రాంతం అని కాకుండా జాతీయ సమగ్రత కోసం ఏర్పడిన పార్టీ తమదని వెల్లడించారు. తాను ఒక వర్గం - కులం - మతం అని కాకుండా సమైక్యతాభావంతో దేశాభివృద్ధిని కోరుకునే మనిషినని చెప్పారు. అయితే.. కాపులు రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. వారి డిమాండ్లో న్యాయం ఉన్నప్పటికీ శాంతియుతంగా సాధించుకోవాలని సూచించారు. ఉద్యమం హింసారూపం సంతరించుకోవడంలో ఉద్యమ నేతల వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యం రెండూ ఉన్నాయంటూ ఆయన ఎప్పటిలా గోడమీద పిల్లిలా మాట్లాడారు.

కాగా కాపులను కేవలం చంద్రబాబు ప్రభుత్వం ఒక్కటే మోసం చేయలేదని... అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఏం చేశాయన్నది ఆలోచించాలన్నారు. రిజర్వేషన్లు ఇవ్వడమనేది ఒక్కరోజులో అయ్యే పని కాదని చెప్పిన ఆయన కాపు రిజర్వేషన్లపై అనేక ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి.. కానీ కాపులకు నమ్మకం కలిగించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఒకవేళ రిజర్వేషన్లు ఇవ్వలేపోతే ఆ పరిస్థితిని ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు.