Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఏం సాధించార‌ని అవార్డు ?

By:  Tupaki Desk   |   26 Sep 2017 5:56 AM GMT
ప‌వ‌న్ ఏం సాధించార‌ని అవార్డు ?
X
అవార్డు ఎందుకు ఇస్తారు? అన్న చిన్న ప్ర‌శ్న వేసుకుంటే.. ఏదైనా ఒక రంగంలో విశేష కృషి చేసి.. అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించినోళ్ల‌కు అవార్డులు ఇవ్వ‌టం.. పుర‌స్కారాలు చేయ‌టం చేస్తుంటారు. తాము ప‌ని చేసే రంగంలో విశేష‌మైన మార్పున‌కు గురి చేసిన వారికి గుర్తింపుగా అవార్డులు ఇవ్వ‌టం రివాజు.

ఇందుకు భిన్నంగా జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన అవార్డు ముచ్చ‌ట గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. సోమ‌వారం సాయంత్రం నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అంత‌ర్జాతీయ అవార్డును ప్ర‌క‌టించిన‌ట్లుగా బ్రేకింగ్ పేరిట న్యూస్‌ ను టీవీ ఛాన‌ళ్లు హ‌డావుడి చేయ‌టం క‌నిపిస్తుంది. మ‌రి.. వారు చేసి హ‌డావుడిలో విష‌యం ఎంత‌న్న‌ది కాస్త లోతుగా చూస్తే.. ఆశ్చ‌ర్య‌పోయే విష‌యాలు క‌నిపిస్తాయి.

బ్రిట‌న్ పార్ల‌మెంటులో న‌వంబ‌రు 17న జ‌రిగే ఇన్నోవేట్ న్యూ ఇండియా స‌భ‌లో ప‌వ‌న్‌ కు ఇండో యూరోపియ‌న్ బిజినెస్ ఫోర‌మ్ ఎక్స్ లెన్స్ అవార్డును ఇవ్వ‌నున్నారు. ఇంత‌కీ ప‌వ‌న్ ఏం చేసినందుకు ఈ అవార్డు ఇస్తున్నారంటే.. ఏపీలోని ఉద్దానం కిడ్నీ బాధితుల అంశంపై ప‌వ‌న్ స్పందించిన తీరుతో పాటు.. చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనానికి స్పందిస్తూ ప‌వ‌న్‌కు ఈ అవార్డు ఇస్తున్న‌ట్లుగా ఐఈబీఎఫ్ (ఇండో యూరోపియ‌ణ్ బిజినెస్ ఫోర‌మ్‌) వెల్ల‌డించింది.

మ‌నోడికి అవార్డు రావ‌టం బాగానే ఉంటుంది. అయితే.. అవార్డు రావ‌టానికి కార‌ణ‌మైన రెండు అంశాల్లో ప‌వ‌న్ ఏమైనా సాధించారా? అంటే లేద‌నే చెప్పాలి. అవార్డు వ‌చ్చింద‌న్న వెంట‌నే ఇలా విమ‌ర్శ‌లు చేయ‌టం ఏమిట‌న్న సందేహం.. ఆగ్ర‌హం కొంద‌రిలో రావొచ్చు. కానీ.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడుకోవ‌టం త‌ప్పేం కాదు. నిజానికి ఈ రోజుల్లో అలాంటి త‌ర్క బుద్ధి లోపించే.. ఎవ‌రిని ప‌డితే వారిని అదే ప‌నిగా అభిమానించ‌టం.. ఆపై ఆరాధించ‌టం ఒక అల‌వాటుగా మారింద‌ని చెప్పాలి. ఉద్దానం విష‌యంలో ప‌వ‌న్ కృషి చేయ‌లేద‌ని చెప్ప‌లేం. అలా అని.. ఆయ‌నేదో సాధించార‌ని చెప్ప‌టం త‌ప్పే అవుతుంది. ఉద్దానం స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఇంకా వెత‌క‌లేదు స‌రిక‌దా.. ఉద్దానం బాధితుల వెత‌లు తీర‌లేదు. తీరుతాయ‌న్న ఆశ త‌ప్పించి ప్రాక్టిక‌ల్ గా చేసిందేమీ లేదు. అలాంట‌ప్పుడు అవార్డును ఏ ప్రాతిప‌దిక ఇస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌.

అంత‌ర్జాతీయ పుర‌స్కారానికి ప‌వ‌న్‌ ను ఎంపిక చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న సంస్థ‌.. చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌టం అన్న విష‌యాన్ని ప్ర‌స్తావించింది. చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌ గా ఉండి ప‌వ‌న్ ఏం చేశారో అంద‌రికి తెలిసిందే. నిజానికి చేనేత విష‌యంలో ఎంతోకొంత చేసిందంటూ ఏమైనా ఉందంటే అది ప్ర‌ముఖ న‌టి స‌మంత‌కే ద‌క్కుతుంది. చేనేత‌కు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన ఆమె.. ప‌లు చేనేత సంఘాల వారి వ‌ద్ద‌కు వెళ్ల‌టం.. వారి క‌ష్టాల గురించి తెలుసుకోవ‌టం క‌నిపిస్తుంది. ఇలా.. నాలుగు చేనేత సంఘాల వ‌ద్ద‌కు వెళ్లి వారి వెత‌ల్ని తెలుసుకున్న స‌మంత‌తో పోలిస్తే.. చేనేత విష‌యంలో ప‌వ‌న్ ఏం చేశారో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే..ప‌వ‌న్‌ కు ఉద్దానం.. చేనేత‌ల్లో చేసిన కృషికి గుర్తింపుగా అంత‌ర్జాతీయ అవార్డు ల‌భించింది.