Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ యాత్ర‌ను బ‌స్సు యాత్ర అనొద్దు.. ?

By:  Tupaki Desk   |   18 May 2018 5:48 AM GMT
ప‌వ‌న్ యాత్ర‌ను బ‌స్సు యాత్ర అనొద్దు.. ?
X
ప‌వ‌న్ సార్ కొత్త మాట చెప్పేశారు. కొన్ని నెల‌ల అంత‌ర్మ‌ధ‌నం త‌ర్వాత‌.. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆశీస్సులు పొంది.. తిరుమ‌ల‌.. చిత్తూరు చుట్టుప‌క్క‌ల ప‌లు పుణ్య‌క్షేత్రాల్ని సంద‌ర్శించిన ఆయ‌న ఎట్ట‌కేల‌కు సిక్కోల్ ట్రిప్ ను క‌న్ఫ‌ర్మ్ చేసేశారు. చిత్తూరు నుంచి నేరుగా విశాఖ‌కు చేరుకున్న ఆయ‌న‌.. తాజాగా తాను చేపట్టే సిక్కోలు ట్రిప్ ను షురూ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ప‌వ‌న్ సారు తాజాగా చేప‌ట్టే యాత్ర ఎలాంటిది? పాద‌యాత్ర చేస్తారా? ఏదైనా వాహ‌నంలో తిరుగుతారా? అంటే.. బ‌స్సు యాత్ర అంటున్నారు. పాద‌యాత్ర చేస్తున్న రోజుల్లో బ‌స్సు యాత్ర చేసుడేంద‌న్న ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్న వారిపై ప‌వ‌న్ ఫాలోయ‌ర్లు సీరియ‌స్ అయిపోతున్నారు. అరే.. బ‌స్సు ఏంది? పాద‌యాత్ర ఏంది? ఏదైనా యాత్రే క‌దా? అంటూ వాదిస్తున్నారు.

యాత్ర తీరు ఏమిట‌న్న దానిపై ఫోక‌స్ పెడితే.. తీవ్ర‌త‌లో తేడా వ‌స్తుంద‌న్న‌ది జ‌న‌సేన‌కుల బాధ‌ని లోగుట్టుగా చెప్పుకుంటున్నారు. జ‌న‌సేన‌కులే కాదు.. జ‌న‌సేనాని సైతం తాను చేసేది బ‌స్సుయాత్ర కాద‌ని.. పోరాట‌యాత్ర‌గా ప్ర‌క‌టించారు. బ‌స్సు యాత్ర‌కు.. పోరాటయాత్రకు తేడా ఏంటి సారూ? అన్న సందేహాన్ని అడిగేంత‌లోనే.. చెప్పాం క‌దా.. మాది బ‌స్సుయాత్ర కాదు.. పోరాట యాత్ర అంటూ మ‌రోసారి ప్ర‌శ్నించ‌కుండా స‌మాధాన్ని చెప్పేస్తున్నారు.

ఇంత‌కీ బ‌స్సు యాత్ర‌.. సారీ.. పోరాట‌యాత్ర షెడ్యూల్ ఏంది బాస్ అంటే.. ప‌వ‌న్ సారు చేసే తాజా యాత్ర ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో 45 రోజుల పాటు న‌డుస్తుంద‌ని చెబుతున్నారు. రానున్న రోజుల్లో పాద‌యాత్ర కూడా ప‌వ‌న్ చేస్తార‌ని చెబుతున్నారు.

అంతా బాగానే ఉంది.. మ‌రి ప‌వ‌న్ సార్ పోరాట‌యాత్ర ఎప్పుడు షురూ అవుతుందంటే.. ఈ నెల 20 నుంచి శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి స్టార్ట్ అవుతుందంటున్నారు. అక్క‌డ అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించి.. గంగ‌మ్మ‌కు పూజ‌లు చేసి యాత్ర‌ను షురూ చేస్తామంటున్నారు. అంటే.. మే 20 నుంచి 45 రోజుల పాటు అంటే.. జులై మొద‌టి వారం వ‌ర‌కూ శ్రీ‌కాకుళం.. విజ‌య‌న‌గ‌రం.. విశాఖ‌ప‌ట్నంజిల్లాల్లోనే ప‌వ‌న్ యాత్ర సాగుతుంది.