Begin typing your search above and press return to search.
పవన్‌ను ఫుల్లుగా వాడేసుకుంటున్న వైకాపా
By: Tupaki Desk | 4 July 2020 3:45 AM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని రీతిలో స్పందించారు ట్విట్టర్లో. ఎప్పుడూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడే పవన్.. ఆయన్ని పొగిడేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఒకేసారి వెయ్యికి పైగా అంబులెన్సులను ప్రవేశ పెట్టడాన్ని ప్రశంసించడమే కాక.. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలను కూడా అభినందించాడు పవన్. ఇది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మన గురించి మన వాళ్లు ఎంత పొగిడినా రాని మైలేజీ.. ప్రత్యర్థులు పొగిడితే వస్తుంది. రాజకీయాల్లో, అందులోనూ ఈ రోజుల్లో అయితే ప్రత్యర్థుల పొగడ్తలకు విలువ మరీ ఎక్కువగా ఉంటుంది.
అందుకే పవన్ పొగడ్తల్ని వాడేసుకోవడానికి వైకాపా వర్గాలు ఎగబడుతున్నాయి. పవన్ ఇలా ట్వీట్లు వేశాడో లేదో.. వాటికి వైకాపా మద్దతుదారులు పెద్ద ఎత్తున రీట్వీట్లు కొట్టేస్తున్నారు. ఈ ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్ తో పాటు ఫేస్ బుక్, వాట్సాప్‌ల్లో ప్రముఖగా పోస్ట్ చేస్తున్న వైకాపా మద్దతు దారులు లెక్కే లేదు. ప్రత్యర్థి పార్టీ అధినేతే పొగిడాడంటే జగన్ పాలన ఎంత గొప్పగా సాగుతోందో చెప్పడానికి ఇంకేం రుజువు కావాలని వాళ్లు అంటున్నారు. ఐతే ఇది పవన్ సెల్ఫ్ గోల్ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. వైకాపా వాళ్లు అతి గా ప్రచారం చేసుకుంటుండటం, జగన్‌ను వ్యతిరేకిస్తూ పవన్ ను అభిమానించే వాళ్లకు ఇది రుచించక పోవడం తో పవన్ ట్వీట్ల వెనుక ఉద్దేశాన్ని చెప్పేందుకు జన సైనికులు బాగా కష్ట పడాల్సి వస్తోంది సోషల్ మీడియా లో.