Begin typing your search above and press return to search.

తగ్గేదేలే.. ఇప్పటం గ్రామస్తులకు మరోసారి పవన్‌ ఆర్థిక సాయం!

By:  Tupaki Desk   |   27 Nov 2022 11:30 AM GMT
తగ్గేదేలే.. ఇప్పటం గ్రామస్తులకు మరోసారి పవన్‌ ఆర్థిక సాయం!
X
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మరోమారు ఇప్పటం గ్రామస్తులకు ఆర్థిక సాయం అందించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కారణంతో వైసీపీ ప్రభుత్వం ఇప్పటం గ్రామస్తుల ఇళ్లను కూల్చివేసిందనే విమర్శలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి ఇప్పటికే జనసేనాని పవన్‌ ఇప్పటంలో పర్యటించారు. కూల్చేసిన ప్రతి ఇంటినీ పవన్‌ పరిశీలించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గతంలో తన సభకు స్థలం ఇచ్చారనే కృతజ్ఞతతో రూ.50 లక్షల ఆర్థిక సాయం ఇప్పటం గ్రామానికి పవన్‌ చేశారు.

మరోమారు ఇప్పుడు ఇల్లు కోల్పోయిన బాధితులకు లక్ష రూపాయల చొప్పున పవన్‌ కల్యాణ్‌ సాయం అందించారు. ఈ మేరకు గ్రామస్తులను మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి లక్ష చొప్పున పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సాయం అందించారు.

ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ తన నాలుగో కుమారుడు గతంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగేశ్వరమ్మ అనే మహిళ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇల్లు కూల్చివేసినవాటిలో నాగేశ్వరమ్మ నివాసం కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ నాగేశ్వరరమ్మకు కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇప్పటం గ్రామస్తులందరినీ తానిస్తున్న గౌరవం ఇదని పవన్‌ తెలిపారు. అమరావతి రైతులు ఇప్పటం గ్రామస్తుల మాదిరిగా తెగించి పోరాడితే ఫలితం వేరేగా ఉండేదని పవన్‌ అన్నారు. అమరావతి రైతులు ఈ తెగింపు చూపితే రాజధాని ఇక్కడ నుంచి కదిలేది కాదని స్పష్టం చేశారు. భయపడితే చంపేస్తారని.. అందుకే భయపడకుండా నిలబడాలని కోరారు.


‘‘చాలామంది అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాను అని అంటారు. నేను కానీ, జనసేన కానీ అధికారంలోకి వచ్చాక సాయం చేయడం కాదు, మనకు చేతనైన సాయం, మేమున్నాం అనే నమ్మకం కల్పించడానికి ఈరోజు వచ్చాను.

జనసేన పార్టీకి స్థలం ఇచ్చారు అనే కారణంతో ఈరోజు ఇప్పటంలో కూల్చివేతలు చేశారు. కొన్నిచోట్ల వదిలేసి, రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని వదిలేసి కూల్చడం కక్షపూరిత చర్య.

ఇప్పటం గ్రామస్థులు నన్ను సొంతబిడ్డలా ఆదరించి అండగా నిలబడ్డారు, వారికి కష్టం వేస్తే నేనున్నాను అని భరోసా కల్పించడానికి వచ్చాను

హైదరాబాద్‌ లో భీమ్‌ రావ్‌ బస్తీ కోల్చేస్తే నేను బయటకు వచ్చి వారికోసం నిలబడ్డాను, అలాంటి సంఘటన మళ్ళీ ఇప్పటంలో చూసాను.

ప్రభుత్వానికి విచక్షణా రహితంగా మన భూములు లాక్కున్నా, సరైన పారితోషకం ఇవ్వకున్నా, కూల్చేసినా నాకు భాద కలుగుతుంది. ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది.

మార్చ్‌ 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా సరే, రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే సభకు ఇప్పతం రైతులు మాకు స్థలాన్నిచ్చారు, వారికి అండగా నిలబడతాను అని ఆరోజే చెప్పాను’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.