Begin typing your search above and press return to search.
జీలకర్రలో కర్ర లేదు..బాబు జాబులో జాబు ఉండదు!
By: Tupaki Desk | 16 Oct 2018 6:11 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కవాతు బహిరంగ సభలో ఆయన సంధించిన పంచ్ లు బాబు బ్యాచ్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2014 ఎన్నికల వేళ.. బాబు వస్తే జాబు అంటూ భారీగా ప్రచారం చేయటమే కాదు.. బాబు జాబు అన్నట్లుగా గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు సర్కారు గడిచిన నాలుగున్నరేళ్లలో చేసిందేమిటో ఒక పోలికతో చెప్పేశారు పవన్.
నేతి బీరలో నెయ్యి ఎలా ఉండదో.. జీల కర్రలో కర్ర ఉండన్నట్లే.. బాబు జాబులో జాబు కూడా ఉండదన్నారు. చెప్పుకోవటమే కాదు.. చేసేదేమీ లేదన్నారు. ఈ విషయాన్ని తనకో పెద్ద మనిషి చెప్పారన్నారు. ఏపీ సీఎం పాలన తీరును సింఫుల్ గా తేల్చేసిన చంద్రబాబు గ్రామాల్లో విద్యుత్ లైట్లు వెలుగుతున్నాయో లేదన్న విషయాన్ని సచివాలయం ద్వారా సీఎం చూడాల్సిన అవసరం లేదని.. అంతకంటే కూడా.. పంచాయితీ సర్పంచులు చేయాల్సిన పనిని వారిని చేయనిస్తే చాలన్నారు.
సకాలంలో పంచాయితీ ఎన్నికల్ని నిర్వహించకపోవటం కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.3,600 కోట్లు ఆగిపోయాయన్నారు. అదే మొత్తం వస్తే.. రోడ్లు.. తాగునీరు.. బడి లాంటి ఏర్పాట్లు ఎంతోకొంత జరిగి ఉండేవని.. కానీ ఎన్నికల్ని సకాలంలో నిర్వహించని కారణంగా కేంద్రం నుంచి వచ్చే వేల కోట్లు రాని పరిస్థితి నెలకొందన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెప్పారని.. ఒక్క కాకినాడ సెజ్ లోనే 50వేల ఉద్యోగాలని.. కానీ ఇప్పటివరకూ 500 ఉద్యోగాలు కూడా రాలేదని ధ్వజమెత్తారు.
పాలనతో అనుభవం ఉందని 2014లో చంద్రబాబుకు తాను మద్దతు ఇచ్చానన్న పవన్.. మంచి పాలన అడిగితే స్కాములు.. దోపిడీ ఇచ్చారన్నారు. దెందులూరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదేం? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు గెలుస్తామన్న నమ్మకం లేదని.. గెలవకున్నా తర్వాత కలిసి పని చేయాలని తనను అడిగినట్లుగా పవన్ పేర్కొన్నారు. జగన్ ను ఎదుర్కొనే దమ్ము.. ధైర్యం బాబుకు లేవన్నారు.