Begin typing your search above and press return to search.
ముద్దుల మామయ్య అంటూ జగన్ కు పవర్ పంచ్
By: Tupaki Desk | 4 July 2022 5:58 AM GMTఆచితూచి మాట్లాడే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వంక పెట్టాల్సిన అవకాశమే ఉండదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటానికి ముందు రాజకీయ నేతల్ని ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో వెనుకా ముందు లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. తీవ్ర ఆగ్రహంతో కూడిన ఆవేశంతో పంచెలు ఊడగొడతా అంటూ విరుచుకుపడిన పవన్.. తర్వాతి కాలంలో అంత ఆవేశాన్ని ప్రదర్శించకున్నా.. కొంత మేర మాత్రం ఆయన గొంతులో ఆగ్రహం వినిపిస్తూ ఉండేది.
కాలం గడుస్తున్న కొద్దీ తొందరపాటుతో మాట్లాడే విషయంలో ఆయన కొన్ని నిబంధనలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే.. మాట విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. ఒకరిని ఒక మాట అనటానికి ముందు తనకు తానే వంద ఫిల్టర్లు వేసుకొన్న వైనం ఆయన మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. అలాంటి పవన్ తాజాగా మాత్రం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని విద్యార్థుల్ని చదివించే బాధ్యత మేనమామగా తీసుకుంటానని చెప్పి.. కనిపించిన వాళ్లను కౌగిలించుకొని ముద్దులు పెట్టిన ముద్దుల మామయ్య విదేశాల్లో తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. విదేశాల్లో తిరుగుతున్న ముఖ్యమంత్రి.. ఫారిన్ లో చదువుకునే విద్యార్థులకు మాత్రం డబ్బులు ఇవ్వటం లేదన్నారు. దీంతో.. వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు
ముద్దులు.. కౌగిలింతలు.. అక్క.. చెల్లెమ్మ అనే పిలుపులు ప్రజలకు అక్కర్లేదని.. వారికి హక్కులు.. చట్టభద్రత కల్పిస్తే సరిపోతుందన్నారు. తప్పులు ఎత్తి చూపిస్తే చాలు వైసీపీలోని కాపు నేతలతో తనను బూతులు తిట్టిస్తున్నారన్నారు. కొన్ని అంశాల్లో సంస్కారం తన నోటిని కట్టేస్తుందన్న పవన్.. ప్రశ్నించిన వారిపై దాడులు చేసి కేసులు బనాయిస్తున్నారన్నారు. వైసీపీ సర్కారు ఫుణ్యమా అని పోలీసులు నిస్సహాయులుగా మార్చారన్నారు.
ధైర్యం లేని గూండాయిజానికి రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు కానీ జనసేన మాత్రం భయపడేది లేదని తేల్చేశారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ నోటి నుంచి ఇలాంటి సెటైర్ వినిపించలేదని.. 'ముద్దుల మామయ్య’ పేరుతో జగన్ కు కొత్త పేరు పెట్టి విమర్శలు సంధించటం ఆసక్తికరంగా మారింది.