Begin typing your search above and press return to search.
ప్రచారం చేస్తానన్న చెర్రీకి పవన్ సలహా ఇదే!
By: Tupaki Desk | 30 May 2018 8:09 AM GMTక్రియాశీల రాజకీయాల్లో బిజీబిజీగా మారతానని చెప్పిన పవన్ స్టార్ పవన్ కల్యాణ్.. గడిచిన కొద్ది రోజులుగా రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయారు. తాజాగా 45 రోజుల పోరాట యాత్ర షెడ్యూల్ లో ఆయన బిజీబిజీగా ఉన్నారు. రాజకీయాలు తప్పించి మరింకే విషయాల్ని ఆయన పట్టించుకోవటం లేదు.
పవన్ పోరాట యాత్రతో ఏపీలో రాజకీయ హీట్ మరింత పెరిగింది. ఓపక్క వైఎస్ జగన్.. మరోపక్క పవన్ చెలరేగిపోతూ బాబు సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటివేళ.. రంగస్థలం హిట్ తో మాంచి ఊపు మీద ఉన్న చెర్రీ.. తాను పవన్ బాబాయ్ తరఫు ప్రచారం చేయటానికి సిద్ధమని ప్రకటించారు.
మెగా ఫ్యామిలీలో పవన్ తో బాగా క్లోజ్ గా ఉండే వారిలో చెర్రీ పేరు మొదట వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే చెర్రీ సినిమా కార్యక్రమాలకు తప్పనిసరిగా పవన్ హాజరవుతూ ఉంటారు.
పవన్ పార్టీ తరఫున ప్రచారం చేయటానికి తాను సిద్ధమని.. బాబాయ్ పిలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించనని చెర్రీ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా ఒక మీడియా సమావేశంలో పవన్ స్పందించారు. రాజకీయాలకు సంబంధించి తాను చేయాల్సింది చేసుకుంటూ పోతానన్నారు. తాను ఎవరిని ప్రత్యేకంగా పిలవనని స్పష్టం చేశారు. తన కుటుంబం అయినా సరే ఇష్టపడే రావాలే తప్పించి.. తాను పిలవనని చెప్పారు. తన తరఫు ప్రచారం చేయటానికి వచ్చినా.. అంతకు ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొన్న తర్వాతే రమ్మని చెబుతానని పవన్ చెప్పారు. చెర్రీ మాటలకు పవన్ స్పందన ఊహించని రీతిలో ఉండటం చూస్తే.. పవనా మజాకానా అనిపించక మానదు.