Begin typing your search above and press return to search.
పవన్ రియాక్ట్ అయ్యాడు..
By: Tupaki Desk | 6 Sep 2015 4:22 AM GMTగత ఐదు రోజులుగా అట్టుడుగుతున్న భీమవరంలో శాంతి నెలకొనేలా.. ఫ్లెక్సీల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు.. అనంతర ఘటనలపై పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని చించివేయటం.. ఆ పని ప్రభాస్ ఫ్యాన్స్ పనేనంటూ పవన్ ఫ్యాన్స్ ఆరోపించి.. దానికి ఆధారాలు చూపిస్తూ.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆస్తులపై దాడి చేయటం.. దీనికి ప్రతిగా మరిన్ని దాడులు చోటు చేసుకోవటం తెలిసిందే.
ఇలా మొదలైన ఈ రచ్చ చివరకు భీమవరం పట్టణంలో 144వ సెక్షన్ అమలు చేయటంతోపాటు.. పలువురిపై కేసులు పెట్టటం.. పదిమంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను అరెస్ట్ చేయటం వరకూ వెళ్లింది.
అమెరికాకు వెళ్లిన పవన్ కల్యాణ్.. శనివారం తిరిగిరావటం.. భీమవరం ఘటన గురించి పూర్తి సమాచారం తెలుసుకోవటం.. జరిగిన ఘటనలపై ఆయన స్పందించటం జరిగాయి. భీమవరంలో ఉన్న చిరు పవనతేజం రాష్ట్ర అధ్యక్షుడు ఉండపల్లి రమేశ్ నాయుడు.. కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు.. కన్వీనర్ అరేటి ప్రభాకర్ లతో పవన్ కల్యాణ్ ఫోన్ లో మాట్లాడారు.
అనంతరం పవన్ స్పందనను మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి వెల్లడించారు. భౌతికదాడులకు తాను వ్యతిరేకినని.. వర్గ వైషమ్యాలకు.. కులమతాలకు తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని.. తన అభిమానులు కక్ష సాధింపు.. ప్రతీకార చర్యలకు పాల్పడే వైకరిని వ్యతిరేకిస్తున్నట్లు కుండబద్ధలు కొట్టేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా స్థానికంగా ఉన్న సినీ హీరోల అభిమాన సంఘాలతో ఒక శాంతి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా వారు వెల్లడించారు.
అయినా.. అమెరికాలో ఉన్న పవన్ ఫోన్ లో స్పందించే కన్నా.. ట్విట్టర్ పిట్టతో కూత పెట్టిస్తే.. ప్రపంచం మొత్తానికి చిటికె లో తెలిసిపోయేది కదా. ఏది ఏమైనా తన ఫ్యాన్స్ వేడిని చల్లారుస్తూ ఒక ప్రకటన అయితే పవన్ చేయించారు.