Begin typing your search above and press return to search.

లెఫ్ట్ తో పవన్ రైట్.. మూడు సీట్లు ఓకే..

By:  Tupaki Desk   |   28 Jan 2019 10:55 AM GMT
లెఫ్ట్ తో పవన్ రైట్.. మూడు సీట్లు ఓకే..
X
ఎట్టకేలకు జనసేనాని నోరు విప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జనసేన పార్టీ పొత్తు పెట్టుకునేది టీడీపీ - వైసీపీతో కాదు.. వామపక్ష పార్టీలతో.. అవును ముమ్మాటికి పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలకే రైట్ కొట్టారు.

తాజాగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ నోరు విప్పారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వామపక్షాలు ఫుల్ ఖుషీ అయ్యాయి. క్షేత్ర స్థాయిలో బలబలాలను అంచనా వేసే పనిలో జనసేన-వామపక్షాలు పడ్డాయి. ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో.. ఒకటి - రెండు స్థానాలకే వామపక్షాలు పరిమితం కాబోతున్నాయి. ఈ మేరకు జనసేన ఇప్పటికే అంతర్గత కసరత్తు చేసినట్లు సమాచారం.

వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో చాలా కీలకం. వైసీపీ అధినేత జగన్ కు జీవన్మరణ సమస్యనే. ఇక అధికార టీడీపీకి కత్తి మీద సవాలే.. పవన్ ఎలాగూ ఉండనే ఉన్నాడు. దీంతో మొదట టీడీపీ-జనసేన మరోసారి జట్టు కట్టి పోటీచేస్తాయని వార్తలొచ్చాయి. కానీ ఈ విషయంలో పవన్ రెస్పాన్స్ కోసం టీడీపీ వేచిచూస్తుండగా.. పవన్ మాత్రం గట్టిగా.. పొత్తు లేదని చెప్పలేకపోతున్నారు. తాజాగా పవన్ వామపక్షాలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని.. కమ్యూనిస్టుల భావజాలానికి, తమ భావజాలానికి సారూప్యత ఉందని సెలవిచ్చారు.

కాగా వామపక్షాల నేతలు తమకు బలమున్న స్థానాల విషయంలో కసరత్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో సీపీఎం పోలవరం - అచంట నియోజకవర్గాల్లో పోటీచేసింది. సీబీఐ మాత్రం పోలవరం, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను నిలబెట్టింది. ఇక సీపీఐ నేతలు తాడెపల్లి గూడెంలో కూడా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా ఈ మూడు నియోజకవర్గాలను కమ్యూనిస్టులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన-కమ్యూనిస్టుల పొత్తుతో వారికే ఈ స్ధానాలు ఖాయమయ్యే అవకాశాలున్నాయి.