Begin typing your search above and press return to search.

పీకే సారు... పాచిపోయిన లడ్డూలలోళ్ల దగ్గరెళతారట

By:  Tupaki Desk   |   30 Aug 2019 2:30 PM GMT
పీకే సారు... పాచిపోయిన లడ్డూలలోళ్ల దగ్గరెళతారట
X
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిపై ప్రస్తుతం కొనసాగుతున్న డైలమాపై జనసేనా పవన్ కల్యాణ్ తనదైన శైలి వ్యూహాన్ని బయటపెట్టారు. అమరావతిపై కొనసాగుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను ఆశ్రయిస్తారట. ఈ మేరకు శుక్రవారం అమరావతికి భూములిచ్చిన రైతులు, అమరావతి ప్రాంత ప్రజలతో భేటీ అయిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై అటు టీడీపీ వైఖరితో పాటు ఇటు అధికార పార్టీ వైఖరిపైనా నిప్పులు చెరిగిన పవన్... ప్రజలకు క్లారిటీ తీసుకొచ్చేందుకు నేరుగా కేంద్రం వద్దకే వెళతానని ప్రకటించారు.

అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి వేలాది ఎకరాల బంగారు భూములను లాక్కున్న టీడీపీ వైఖరి సరికాదని పేర్కొన్న పవన్... ప్రస్తుతం రాజధానిపై కన్ఫూజర్ క్రియేట్ చేస్తున్న వైసీపీ మంత్రుల వైఖరిపైనా నిప్పులు చెరిగారు. ఇకనైనా ఈ తరహా కన్ఫూజన్ రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, లేదంటే తగిన రీతిలో బుద్ధి చెబుతానని కూడా పవన్ కల్యాణ్ వైసీపీ సర్కారుకు ఏకంగా వార్నింగులే ఇచ్చేశారు. సరే... అమరావతిపై కన్ఫూజన్ క్రియేట్ అయిన మాట వాస్తవమే గానీ... గతంలో అమరావతితో పాటు ఏపీకి విభజన హామీల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వని మోదీ సర్కారుపై కాకినాడ వేడికగా పవన్ తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిఃందే కదా. నాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోదీ సర్కారు చెప్పిన వైనాన్ని గుర్తు చేసిన పవన్... పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలంటూ తనదైన శైలిలో ఫైరైపోయారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, పాచిపోయిన లడ్డూల మాదిరిగా ఉన్న ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరని కూడా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీకి కూడా విరోధిగానే మారిపోయిన పవన్... రాష్ట్రానికి ఏం కావాలన్నా అది కేంద్రం చేతిలోనే ఉందన్న సత్యాన్ని గ్రహించినట్లుగా ఉన్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల వద్దకు వెళతానని సంచలన ప్రకటనలు చేశారు. అయినా పీకే ఢిల్లీ వెళ్లినా... ఆయనకు అటు మోదీ గానీ, ఇటు అమిత్ షా గానీ కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? అన్న దిశగానూ ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. మొత్తంగా కాస్త ఆలస్యంగానైనా రాజధాని అమరావతిపై పవన్ స్పందించారులే అన్న భావన వ్యక్తమవుతోంది.