Begin typing your search above and press return to search.
మరో యుద్ధానికి పవన్ రెడీ
By: Tupaki Desk | 5 Jun 2019 9:22 AM GMTపవన్ కళ్యాణ్ ఓటిమిని జీర్ణించుకున్నారు. ఎన్నికల యుద్ధానికి మళ్లీ సిద్ధమయ్యారు. ఏపీలో త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో జనసేనను బరిలో నిలపడానికి అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించారు. అంతకుమునుపై సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పంచాయితీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పని మొదలుపెట్టారు. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. ముఖ్యమంత్రి మార్పు అంశం కాబట్టి జనసేనకు ఎక్కువ ఓట్లు పడలేదు. అదే స్థానిక సంస్థల పరిధి దృష్టా కనీసం ఆరేడు జిల్లాల్లో పలు చోట్ల సత్తా చూపే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పవర్ స్టార్ భావిస్తున్నారు. అందుకోసం పథక రచన చేస్తున్నారు.
ఓటమి అనంతరం తొలిసారి పార్టీ కార్యక్రమాలను పవన్ మొదలుపెట్టబోతున్నారు. అందుకే ఆయన గురువారం అమరావతికి రానున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ్నుంచి పటమటలంకలోని తన నివాసానికి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో సమీక్షా సమావశం నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అందులో ఓటమికి పార్టీ లోపాలు చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఓడిపోయిన అభ్యర్థులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. అందరినీ నుంచి ఓటమికి ఫీడ్ బ్యాక్ పంపాలని పార్టీ కోరిందట. పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి నేతలకు ఆదేశాలు అందాయి. ఎన్నికల ముందే మనది సుదీర్ఘ ప్రయాణం అని చెప్పామని... ఓటమి కనీసం స్పీడ్ బ్రేకర్ కూడా కాదన్నారు. ప్రజా సమస్యలపై మనం చేసే పోరాటమే మనకు మంచి రోజులను తెస్తుందన్నారు. తాజా ప్రకటనలో పవన్ కళ్యాణ్ తాను సినిమాలు మానేసినట్లు మరోసారి ప్రకటించారు.
ఇదిలా ఉండగా ముస్లీం సోదరులకు పవన్ కల్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.