Begin typing your search above and press return to search.
పవన్ చెప్పేశారు. ఇక బాబు.. జగన్ మాత్రమే...?
By: Tupaki Desk | 15 March 2022 8:29 AM GMTఏపీలో మూడు ప్రధాన పార్టీలలో ఒకటైన జనసేన తన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. భారీ జన సందోహం మధ్య జనసేన సభ అద్భుతంగా సాగింది. పవన్ గతానికి భిన్నంగా రాజకీయ పరిపక్వతతో బాగా మాట్లాడారు అని విమర్శకుల వైపు నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. తాను ఏం చేయదలచుకున్నదీ పవన్ సభలో వివిధ వర్గాలకు చెప్పారని, క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారని అంటున్నారు.
ఇక పవన్ ఆవిర్భావ సభలో చేసిన మరో ఆసక్తికరమైన పని ఏంటి అంటే ఎన్నికలకు రెండేళ్ళ ముందుగానే మ్యానిఫేస్టోని ప్రకటించడం. ఇది నిజంగా ఏపీ రాజకీయాలకే కాదు, దేశ రాజకీయాలకు కూడా కొత్తే ఎవరైనా ఎన్నికల ప్రణాళికను నోటిఫికేషన్ కి ముందో వెనకో ప్రకటిస్తారు.
కానీ పవన్ మాత్రం చాలా దూకుడు చూపారు అని అంటున్నారు. దీని వల్ల మ్యానిఫేస్టో జనాల్లోకి బాగా వెళ్ళి చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. ఆయా వర్గాలు కూడా పార్టీ పట్ల సానుకూలంగా మారే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. మరి పవన్ తన ఎన్నికల హామీలు ఏంటో చెప్పేశారు.
దాంతో ఇపుడు మరో రెండు పెద్ద పార్టీల మీద అందరి చూపూ పడుతోంది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎన్నికల ప్రణాళికలు ముందే ప్రకటిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక చూసుకుంటే టీడీపీ, వైసీపీ పార్టీ సభలు ముందున్నాయి.
నిజానికి ఏపీలో మూడు పార్టీలూ పుట్టినది మార్చి నెలలోనే. వైసీపీ మార్చి 12న ఆవిర్భవిస్తే, మార్చి 14న జనసేన, మార్చి 28న టీడీపీ ఏర్పాటు అయ్యాయి. కానీ టీడీపీ ఎపుడూ ఎన్టీయార్ పుట్టిన రోజునే మహానాడు పేరిట పార్టీ సభలను నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుంది.
అదే విధంగా వైఎస్సార్ జయంతి రోజున ప్లీనరీ నిర్వహించాలన్నది వైసీపీ సంప్రదాయం. దాంతో రానున్న మే. జూలై నెలల్లో ఏపీలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగే చాన్స్ ఉంది. ముందుగా టీడీపీ మహానాడు విషయం తీసుకుంటే ఆ పార్టీ కూడా మూడేళ్ళ వైసీపీ పాలన మీద విస్తృతంగా చర్చించడమే కాదు, ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉంది.
అదే విధంగా తాము వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తామన్నది కూడా చూచాయగా టీడీపీ ఒక ప్రణాళికను ప్రకటించనుందని అంటున్నారు. ఏపీలో పొత్తుల గురించి కొంత కదలిక పవన్ తీసుకువచ్చారు. దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవడానికి టీడీపీ మహానాడులో తన ఆలోచనలను చెబుతుంది అంటున్నారు.
టీడీపీ ఆలోచన కూడా వైసీపీకి యాంటీగా మహా కూటమి అని అంటున్నారు. జగన్ కి వ్యతిరేకంగా పడే ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా ఒడిసిపట్టాలని టీడీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఇక వైసీపీ ప్లీనరీ కూడా ఈసారి ఆసక్తికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ప్లీనరీ నాటికి మంత్రి వర్గ విస్తరణ కూడా పూర్తి చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. ప్లీనరీలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేదా అన్నది కూడా తేలే విషయం ఉందని చెబుతున్నారు. అలాగే తమ మూడేళ్ల పాలన మీద సమీక్ష చేసుకోవడంతో పాటు కొత్త హామీలు ఏమైనా ఇస్తారా అన్నది కూడా వైసీపీ ప్లీనరీలో ఒక స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. మొత్తానికి పవన్ మొదలెట్టారు. బాబు, జగన్ కూడా ఏం చెబుతారో చూసిన మీదటనే ఏపీ రాజకీయం హీట్ ఏ లెవెల్ కి వెళ్ళింది అన్నది తెలుస్తుంది అంటున్నారు.