Begin typing your search above and press return to search.
రీకాల్ సిస్టమ్ పవన్ వల్లవుతుందా ?
By: Tupaki Desk | 20 Jun 2022 5:32 AM GMTసక్రమంగా పనిచేయని ప్రజాప్రతినిదులను తాను అధికారంలోకి వస్తే రీకాల్ చేసేస్తాను..రీకాల్ సిస్టమ్ అమల్లోకి రావాలి..ఇవి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. బహుశా రీకాలింగ్ సిస్టమ్ మీద పవన్ కు సరైన అవగాహన ఉన్నట్లు లేదు. రీకాలింగ్ సిస్టమ్ అనేది ఎంతో అభివృద్ధి అయ్యామని చెప్పుకుంటున్న పాశ్చాత్య దేశాల్లోనే అన్నీచోట్లా లేదు. నిజానికి ఈ విధానం చాలా కష్టతరమైన వ్యవహారం. అందుకనే చాలాదేశాలు దీని జోలికి వెళ్ళటంలేదు.
తామెన్నుకున్న ప్రజాప్రతినిధి తమ ఆలోచనలకు, ఆకాంక్షలకు తగ్గట్లుగా పనిచేయటం లేదని కానీ లేదా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కానీ మెజారిటి జనాలు భావిస్తే సదరు ప్రజాప్రతినిధిని రీకాల్ చేయాలంటు ప్రభుత్వానికి షిర్యాదు చేస్తారు.
దీనికి కూడా మొత్తం ఓటర్లలో ఇంతమంది అభిప్రాయపడాలనే నిబంధనుంది. తమకు అందిన ఫిర్యాదు నిబంధనల ప్రకారముంటే అప్పుడు విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది.
ప్రజాభిప్రాయం తీసుకునేందుకు కూడా ప్రభుత్వం బ్యాలెట్ పద్దతిని ఎంచుకుంటుంది. అందులో 50 శాతంకు పైగా సదరు ప్రజా ప్రతినిదిని రీకాల్ చేయాలని అభిప్రాయపడినపుడు మాత్రమే ప్రజాప్రతినిధిని రీకాల్ చేస్తారు. 50 శాతం ప్రజాభిప్రాయంలో ఒక్కశాతం తగ్గినా రీకాల్ సాధ్యంకాదు. ఇంతటి క్లిష్టతరంగా ఉంటుందికాబట్టే రీకాల్ సిస్టమ్ ను చాలాదేశాలు అమలు చేయటంలేదు. ఇలాంటి వ్యవస్ధను తాను అమలుచేసేస్తానని పవన్ చాలా తేలిగ్గా చెప్పేయటమే విచిత్రంగా ఉంది.
మనదేశంలో కూడా రీకాల్ సిస్టమ్ ఉండాలనే చర్చ జరుగుతోంది. దీనికి ముందు దేశంలోని అన్నీ అసెంబ్లీలు తీర్మానాన్ని పాస్ చేయాల్సుంటుంది. తర్వాత ఆ తీర్మానాలపై పార్లమెంటులో చర్చలు జరగాలి. ఆ తర్వాత బిల్లును రూపొందించి పార్లమెంటులో ఓటింగ్ కు తీసుకురావాలి. అప్పుడు ఓటింగులో బిల్లు గట్టెక్కాలి. దాన్ని రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ఎన్నికల కమీషనర్ కు పంపుతారు.
కేంద్ర ఎన్నికల కమీషన్ అప్పుడు రీకాలింగ్ వ్యవస్ధను అమల్లోకి తెస్తుంది. మనదేశంలో ఇదంతా జరిగేపనికాదని పవన్ కు తెలీదేమో. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాలన్న తేడాలేకుండా అందరు ఏకమైపోతారు. అందుకనే రీకాల్ సిస్టమ్ మనదేశంలో చర్చలకు మాత్రమే పరిమితమవుతోంది.