Begin typing your search above and press return to search.
ఏడు సిద్ధాంతాలు..మావూళ్లమ్మ సన్నిధి..ఇదే జనసేన మ్యానిఫెస్ట్
By: Tupaki Desk | 14 Aug 2018 12:30 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ జర్నీలో భాగంగా మరో కీలక అడుగు వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర కొనసాగుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. భీమవరంలో కొలువై వున్న మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. అమ్మవారి పాదాల వద్ద మ్యానిఫెస్టో ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలోని కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఏడు సిద్ధాంతాలతో జనసేన మేనిఫెస్టో రూపొందించారు. ``విజన్ మేనిఫోస్టో`` పేరుతో ఇందులోని అంశాలను పేర్కొన్నారు.
కులాలు లేని రాజకీయం..మతాల ప్రస్తావన లేని రాజకీయం..భాషలను గౌరవించే సంప్రదాయం.. సంస్కృతులను కాపాడే సమాజం..ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం..అవినీతిపై రాజీ లేని పోరాటం,..పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం..వంటి పన్నెండు అంశాలు..పలు సిద్ధాంతాలతో జనసేన అధినేత జనసేన పార్టీ మేనిఫెస్టోని ప్రకటించారు. ప్రజలకు మంచి ప్రమాణాలతో కూడిన జీవనాన్ని అందించాలి. తాగడానికి పరిశుద్ధమైన నీరు - కలుషితంకాని గాలి - ఆరోగ్యకరమైన పరిసరాలు.. ఇవి ప్రతి ఒక్కరికీ దక్కేలా జనసేన పాటు పడుతుంది. ప్రజలందరికీ ముఖ్యంగా ఆడపడుచులకు పూర్తి భద్రతతో కూడిన పౌర సమాజాన్ని నిర్మించాలి... ఇది జనసేన దృఢ సంకల్పం. మానవాళి నిరాశ - నిసృహలకు లోనుకాకుండా వారి జీవితాల్లో వసంతం తీసుకురావడం మా లక్ష్యం. ఈ దిశలోనే జనసేన మేనిఫెస్టో ఉండబోతుంది. సార్వజనీనకంగా ఉండే మేనిఫెస్టో సంపూర్ణ ప్రతిని త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. ఇప్పటికే పార్టీ గుర్తును ప్రకటించిన పవన్ అందరు సమైక్యంగా వుండాలనే నినాదంతో తన పార్టీ గుర్తును పిడికిలిగా ప్రకటించారు. పేరుతో పవన్ ప్రకటించనున్నారు. దీంట్లో జనసేన పార్టీ ఏడు సిద్దాంతాలతో మేనిఫోస్టోని రూపొందించినట్లుగా తెలుస్తోంది.
మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు ఇవి
1. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు
2. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
3. రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో 2500 - 3500 వరకు నగదు
4. బీసీలకు అవకాశాన్ని బట్టి 5% వరకు రిజర్వేషన్లు పెంపుదల
5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
6. కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
7. SC వర్గీకరణకు సామరస్య పరిష్కారం
8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్
9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్ధులకు వసతిగృహాలు
10. ముస్లింల అభివృద్ధికి సచార కమిటీ విధానాలు
11. ప్రభుత్వ ఉద్యోగుల CPS విధానం రద్దు
12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు