Begin typing your search above and press return to search.
మాయావతికి కాళ్లకు నమస్కారం... పవన్ వివరణ ఇది
By: Tupaki Desk | 8 April 2019 1:07 PM GMTఉత్తరప్రదేశ్... అరాచకాలు, రౌడీయిజం, మహిళలు అంటే చిన్నచూపు, పరువు హత్యలు... ఇలాంట అధికంగా ఉన్న రాష్ట్రం. అలాంటి చోట ఓ దళిత మహిళ ముఖ్యమంత్రి అయ్యిందంటే... ఆమె ఎంత కష్టపడి పైకి వచ్చి ఉండాలి... అందుకే మాయావతి కి పాదాభివందనం చేశాను. ఆ గౌరవానికి ఆమె అర్హురాలు... అని పవన్ వ్యాఖ్యానించారు.
మాయావతిని అక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారంటే ఆమె ప్రజలకు ఎంత భరోసా కలిగించి ఉంటుందో ఆలోచిస్తే.. ఆశ్చర్యం అనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు నమ్మకపోవచ్చు...కానీ టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిందంటే అందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందనేది ఏపీ ప్రజలకు తెలుసన్నారు. నిజాన్ని ఎవరూ మార్చలేరు అన్నారు.
ఈ సందర్భంగా పవన్ టీడీపీపై విరుచుకుపడ్డారు. ‘తోట త్రిమూర్తులను నేను ఎప్పుడూ పార్టీలోకి రమ్మని అడగలేదు. తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తులు టీడీపీ చెంచాలు‘ అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిమూర్తులు నిన్ను హెచ్చరిస్తున్నా.... జాతి గౌరవం కాపాడు. నాకు చెబుతావా నువ్వు? నా అన్న చిరంజీవి మాటే వినను నేను. నీ మాట వింటానా? తెలుగుదేశం నాయకులవి బానిస బతుకులు అంటూ తీవ్రంగా విమర్శించారు.