Begin typing your search above and press return to search.

తెలుగుదేశం తానులో ముక్క‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్!

By:  Tupaki Desk   |   18 Dec 2019 4:57 AM GMT
తెలుగుదేశం తానులో ముక్క‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్!
X
అభివృద్ధి అనేది వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని అనేక మంది మేధావులు కూడా అభిప్రాయ‌ప‌డుతూ ఉంటారు. ఈ రోజుల్లో అంతా ఒక చోటే ఉండాలి, అంతా ఒక చోట నుంచినే జ‌ర‌గాలి అన‌డమే స‌రి కాద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతూ ఉంటారు. అయితే అలాంటి విజ‌న్ చంద్ర‌బాబు నాయుడుకు సుతార‌మూ న‌చ్చ‌డం లేదు. అంతా త‌న క‌ల‌ల న‌గ‌రం అమ‌రావ‌తి నుంచినే సాగాల‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకొచ్చారు.

అయితే అమ‌రావ‌తి ప‌రిస్థితి ఆలూ లేదు చూలూ లేదూ.. అన్న‌ట్టుగానే సాగింది. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్ వేయించారు. న‌క‌లు న‌గ‌రం ఒక‌టి రూపొందించారు. అంత‌కు మించి వాస్త‌వంలోకి రాలేదు అమ‌రావ‌తి. చంద్ర‌బాబు నాయుడు వేసిన గ్రాఫిక్స్ ఇంకో యాభై యేళ్లు అయినా ఊసులోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. అది కూడా ఆయ‌నే చెప్పారు. అమ‌రావ‌తి ప్లాన్ ఇప్ప‌టికి కాద‌ని, రెండు వేల యాభైకి అంటూ ఆయ‌నే కొన్ని సార్లు చెప్పుకొచ్చారు.

యాభై యేళ్ల త‌ర్వాతి సంగ‌తి గురించి ఇప్పుడు క‌ల‌లు క‌న‌డ‌మే చంద్ర‌బాబు నాయుడు చెప్పిన థియ‌రీ. అయితే జ‌గ‌న్ అందుకు పూర్తిగా భిన్నంగా వికేంద్రీక‌ర‌ణ వైపు మొగ్గు చూపారు.

ఇది వ‌ర‌కూ హైద‌రాబాద్ విష‌యం లో సీమాంధ్ర చాలా న‌ష్ట‌ పోయింది. ఆ విష‌యాన్ని అంతా అప్పుకుంటారు. ఇలాంటి నేప‌థ్యంలో అమ‌రావ‌తి అంటూ.. మ‌ళ్లీ రాయ‌ల‌సీమ‌ను, ఉత్త‌రాంధ్ర‌ ను అన్యాయం చేయ‌డం ఏ మాత్రం సమంజ‌సం కాదు కూడా. ప్రాంతీయ విబేధాలు రాకూడ‌దు. అందుకు వీకేంద్రీక‌ర‌ణే మార్గం. జ‌గ‌న్ ఈ మాట అన్నారు కాబ‌ట్టి.. టీడీపీ దాన్ని వ్య‌తిరేకిస్తూ ఉంది.

ఇక తెలుగుదేశం పార్టీ తానులోని ముక్క‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఈయ‌న కూడా వికేంద్రీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. చంద్ర‌బాబు నాయుడుకు వంత పాడుతూ ప‌వ‌న్ ట్వీట్లు పెడుతూ ఉన్నారు. అమ‌రావ‌తే లేద‌ని, అలాంట‌ప్పుడు మూడు రాజ‌ధానులు ఎలా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించేశారు. ఇదైతే నిజ‌మే. చంద్ర‌బాబు నాయుడు చెప్పిన గ్రాఫిక్స్ ప్ర‌కారం అయితే అమ‌రావ‌తి ఎప్ప‌టికీ ఉండ‌దు. వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా వెళితే మూడు రాజ‌ధానులు సాధ్య‌మే ప‌వ‌న్ ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవాలి!