Begin typing your search above and press return to search.

హింసా ఉద్యమంతో రిజర్వేషన్ అసాధ్యం: పవన్

By:  Tupaki Desk   |   1 Feb 2016 10:59 AM GMT
హింసా ఉద్యమంతో రిజర్వేషన్ అసాధ్యం: పవన్
X
కాపు గర్జన సభ సమయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆయన చెప్పారు. తునిలో జరిగిన సంఘటనపై పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తగినంత పోలీస్‌ ఫోర్సును సభా ప్రాంగణం వద్ద నియమించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదని ఆయన చెప్పారు. రైలు దగ్ధం అనేది చిన్న సంఘటన కాదని ఆయన అన్నారు.

హింస వల్ల ఉద్యమ ఫలితాలు రావడం ఆలస్యమవుతుందని ఆయన కాపులకు బోధించారు. శాంతియుతంగా చేసే ఏ ఉద్యమమైనా విజయవంతమవుతుందని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ చౌరాచౌరీ వంటి ఘటనల వల్ల స్వాతంత్ర్యం రావడం సుమారు 25 ఏళ్లు ఆలస్యమైందని చెప్పిన పవన్.. శాంతియుతంగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలన్నారు. రైలు తగలబెట్టడం వంటి ఘటనలు చూసి బాధ అనిపించిందన్నారు. కాపులను ఒకప్పుడు బీసీలుగా పరిగణించే వారని, వారిని బీసీలుగా గుర్తించాలనే డిమాండ్‌ అనేక దశాబ్ధాలుగా ఉందని అన్నారు. కాపులను బీసీలుగా చేరుస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఎవరూ అమలుచేయట్లేదనే ఆవేదన వారిలో ఉందని అన్నారు.