Begin typing your search above and press return to search.
పవన్ టీవీ ఛానెల్.. లైట్ తీస్కో బాస్
By: Tupaki Desk | 22 April 2016 1:30 PM GMTదున్నపోతు ఈనిందంటే.. గాట్లో కట్టేయమన్నాడంట ఎవడో. పవన్ టీవీ ఛానెల్ వ్యవహారం కూడా ఇలాంటిదే అంటున్నారు అతడి సన్నిహితులు. తాను ఓ టీవీ ఛానెల్ పెట్టేస్తున్నానని.. పేపర్ కూడా మొదలుపెడుతున్నానని.. మీడియాలో వచ్చిన వార్తలు చూసి పవన్ తనదైన శైలిలో నవ్వేశాడని అంటున్నారు వాళ్లు. ‘‘పవన్ కు మీడియా వ్యాపారంలోకి ప్రవేశించే ఉద్దేశాలు ఎంత మాత్రం లేవు. ప్రస్తుతం తన దృష్టంతా తర్వాతి రెండు మూడేళ్లలో చేయాల్సిన సినిమాల మీదే ఉంది. జనసేన పార్టీకి సంబంధించి పవన్ ప్రణాళికలు పవన్ కు ఉన్నాయి. కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితుల్లో పవన్ లేడు’’ అని పవన్ కు ఆప్తుడైన ఓ మిత్రుడు చెప్పాడు.
ప్రకటనల్లో నటించడానికే పెద్దగా ఆసక్తి చూపించని పవన్.. మీడియా వ్యాపారం ఎలా చేస్తాడు అని పవన్ మిత్రడు ప్రశ్నించాడు. ‘‘పవన్ స్వతహాగా సిగ్గరి. వ్యాపారాల మీద ఏనాడూ ఆసక్తి చూపించింది లేదు. ఇక రాజకీయ లక్ష్యాల కోసం టీవీ ఛానెల్ పెడతాడన్నది పూర్తిగా అర్థ రహితమైన ఆలోచన’’ అని అతనన్నాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న పవన్.. ‘ఖుషి’ దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ ఫ్యాక్షన్ నేపథ్యమున్న లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. 2019 ఎన్నికల ముందు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడతానన్న పవన్.. ఆ లోపు వచ్చే రెండు మూడేళ్లలో సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.