Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ స్పంద‌న :మునికోటి మ‌ర‌ణం బాధాక‌రం...

By:  Tupaki Desk   |   9 Aug 2015 3:29 PM GMT
ప‌వ‌న్ స్పంద‌న :మునికోటి మ‌ర‌ణం బాధాక‌రం...
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా కోసం చిత్తూరు జిల్లాకు చెందిన మునికోటి ఆత్మాహుతి చేసుకోవ‌డంపై జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో స్పందించారు. "మునికోటి చనిపోవడం నాకు చాలా బాధగా కలిగించింది. మునికోటి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పవన్‌ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడ‌టం స‌రికాద‌ని ప‌వ‌న్ స్పందించారు. తనకు తాను నియంత్రించుకున్నట్టు పవన్ తెలిపారు.

ప్రత్యేక హోదా పై పవన్‌ ఎందుకు మాట్లాడటంలేదని పలువురు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరెన్ని అన్నా తాను అనుకున్నప్పుడే స్పందించే పవన్ మునికోటి మరణంపై త‌న బాధను ట్విట్టర్‌ లో తెలిపారు. అయితే ప్ర‌స్తుతానికి నిగ్ర‌హించుకుంటున్నాను అని చెప్పిన ప‌వ‌న్‌...ప్రత్యేక హోదా కోసం ఒకరి బలిదానం చేసుకున్న తర్వాత పవన్ త‌న‌ యాక్షన్‌ ను ఎలా రూపొందిస్తారు, అది ఎలా ఉండనుందనేది ఆస‌క్తికరంగా మారింది.