Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్: తెగేదాకా లాగొద్దు
By: Tupaki Desk | 27 Jun 2015 4:46 PM GMTఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అమలుపై తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద పడింది. ఆయన ఎందుకు స్పందించడం లేదంటూ రాజకీయ నాయకులు, విశ్లేషకులే కాకుండా సామాన్యులు కూడా సందేహించారు. సోషల్ మీడియాల్లో పవన్ ను ప్రశ్నించారు. అయితే తాజాగా పవన్ తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
రాజకీయాలంటే పగలు, ప్రతీకారాలు కాదని, దేన్నీ తెగేదాకా లాగొద్దని పవన్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. నాయకులు పగలు, పంతాలకు పోతే మధ్యలో నలిగిపోయేది ప్రజలేనని, అధికారంలో ఉన్న వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. నేతలంతా దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆఫ్రికాలో నల్లజాతీయులను అణచివేతకు గురిచేసినా...తెల్లజాతీయులతో నెల్సన్ మండేలా స్నేహ పూర్వకంగానే మెలిగారని పవన్ ప్రస్తావించారు.
అయితే పవన్ ట్వీట్లలో ఎక్కడా ఓటుకు నోటు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 ప్రస్తావన లేకపోవడం గమనార్హం. తెలుగు రాష్ర్టాల్లో ఆ విషయాలు తీవ్ర దుమారం రేపుతున్న సమయంలో పవన్ స్పందించినా ఆయా అంశాలను ప్రస్తావించకపోవడం ఆసక్తికరంగా మారింది. అయితే... తన మనసులోని మాటను పవన్ పరోక్షంగా బయటపెట్టారని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.