Begin typing your search above and press return to search.
పవన్ వేదన; మనసున్న నేత స్పందన ఇది..!
By: Tupaki Desk | 14 July 2015 10:47 AM GMTఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలి? ప్రజల పట్ల నిజంగా ప్రేమాభిమానాలు ఉన్న మనసున్న వ్యక్తి ఏం చేస్తాడు? శవ రాజకీయంతో మైలేజీ పెంచుకోవాలని చూస్తాడా?లేక.. బాధితులకు సాయం అందే ప్రయత్నం చేస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.
గోదావరి పుష్కరాల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటతో 27 మంది మరణించిన నేపథ్యంలో.. ట్విట్టర్ లో ఆయన స్పందించారు. తన వేదనను ట్వీట్స్ రూపంలో పంచుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన రాజకీయ నాయకుల మాదిరి కాకుండా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే.. తనకు ఘటనా స్థలికి రావాలని ఉందని. .అయితే.. ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున తాను రావటం లేదని పేర్కొన్నారు.
తాను వెళ్లని కారణాన్ని వివరించిన ఆయన.. తన కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని.. బాధితులకు సాయం చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం బాధితులకు కావాల్సింది సహాయక చర్యలు తప్పించి.. నేతల రాజకీయ పరామర్శలు కాదన్న విషయాన్ని మనసున్న మనిషిగా పవన్ తన ట్వీట్స్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.
వపన్ కల్యాన్ ట్వీట్స్ ను యథాతధంగా చూస్తే..
ఈరోజు పుష్కరాలలో జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. గాయపడిన వారికి నా సానుభూతి తెలియ జేస్తున్నాను. ..చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను. అక్కడకు వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యలలో పాల్గొనాలని ఉన్నా..దానివల్ల మళ్ళీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించి రావటం విరమించుకున్నాను. సహాయక చర్యలకు తోడ్పాటు అందించ వలసినదిగా 'జనసేన' కార్య కర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను.