Begin typing your search above and press return to search.

రావెల రాద్దాంతంపై ప‌వ‌న్ విసుర్లు

By:  Tupaki Desk   |   23 Aug 2015 9:29 AM GMT
రావెల రాద్దాంతంపై ప‌వ‌న్ విసుర్లు
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏపీ సాంఘిక సంక్షేమ‌శాఖా మంత్రి రావెల కిషోర్‌ బాబు త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు ప‌వ‌న్ ఘాటుగానే కౌంట‌ర్ ఇచ్చాడు. ఆదివారం పెనుమాక ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ తాను భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా చేసిన ట్వీట్ల‌పై రావెల స్పందిస్తూ ఇప్ప‌టికే 95 శాతం భూసేర‌ణ పూర్త‌య్యింద‌ని..మిగిలిన ఆఫ్ర్టాల్ 3 వేల ఎక‌రాల భూసేక‌ర‌ణ కోసం ప‌వ‌న్ ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నాడ‌ని అన్నార‌ని...రావెల‌కు 3 వేల ఎక‌రాలు ఆఫ్ర్టాల్ అయితే గ‌తంలో వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఔట‌ర్‌ రింగు రోడ్డు కోసం టీడీపీ ఎంపీ ముర‌ళీమోహ‌న్‌ కు చెందిన భూమిని తీసుకుంటే ఆయ‌న సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లార‌ని..అది రావెల‌కు గుర్తులేదా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

ముర‌ళీమోహ‌న్ వ‌ద్ద పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంద‌ని..అలాంటి వ్య‌క్తి త‌క్కువ భూమి కోల్పోతేనే ఏకంగా సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళితే....చిన్న చిన్న క‌మ‌తాల్లో వ్య‌వ‌సాయం చేసుకుంటూ...దానిపై ఆధార‌ప‌డి జీవ‌నం సాగించే రైతుల‌కు ఎంత బాధ ఉంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రావెల ఆఫ్ర్టాల్ ..ఆఫ్ర్టాల్ అనే ప‌దం వాడ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప‌వ‌న్ విరుచుకుప‌డ్డారు.

బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ వ‌ద్ద‌ని చెపుతుంటే టీడీపీ మంత్రులు ప‌వ‌న్ అభివృద్ధికి ఆటంక‌మ‌ని ట్లాడుతున్నార‌ని...వారికి తాను ఆ పార్టీకి ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ప‌లికిన‌ప్పుడు......వైజాగ్ హుదూద్ తుఫాను సంద‌ర్భంగా చంద్ర‌బాబు అనుభ‌వాన్ని మెచ్చుకున్న‌ప్పుడు తాను అభివృద్ధికి ఆటంక‌మ‌న్న విష‌యం గుర్తుకు రాలేదా అని ప‌వ‌న్ ఫైర్ అయ్యారు. టీడీపీ నాయ‌కులంద‌రు విచ‌క్ష‌ణ‌తో ఆలోచించి బ‌ల‌వంతంగా కాకుండా...రైతుల‌ను ఒప్పించి భూసేర‌ణ చేయాల‌ని ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి చేశాడు.