Begin typing your search above and press return to search.
ఎంపీలపై మళ్లీ పవన్ ఫైర్
By: Tupaki Desk | 26 Nov 2016 12:47 PM GMTజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు రాష్ట్ర ఎంపీలపై మండిపడ్డారు. ఈ దఫా కేవలం రాష్ట్ర పార్లమెంటు సభ్యులతోనే సరిపెట్టకుండా జాతీయ పార్టీ ఎంపీలను సైతం టార్గెట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రం, దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. "కేంద్రంలోని ఎంపీలంతా ప్రజల కష్టాలకు సంఘీభావం తెలపడానికి బ్యాంక్‌ల దగ్గర క్యూలో నిలబడితే బావుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీలు కూడా ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర నిలబడి తమ వంతు మద్దతు తెలపాలి. అలా చేయడం ద్వారా ప్రజలకు కాస్తంత ధైర్యంగా ఉంటుంది" అని పవన్ ట్వీట్ చేశారు.
కర్నూల్ లో తన డబ్బులు తీసుకోవడానికి మూడు రోజులుగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపంలోనే మరణించిన బాలరాజు ఉదంతాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఈ మేరకు బాలరాజు మృతదేహం ఫొటోను పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదిలాఉండగా విప్లవయోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతిపట్ల పవన్ సంతాపం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరఫున ఆయన పోరాటాలకు సెల్యూట్ తెలుపుతున్నట్లు ప్రకటించారు. క్యూబాలో ఆరోగ్య రంగానికి అనువుగా ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు మరపురానివని కొనియాడారు. తనకు నిత్యం మార్గదర్శకత్వం చేసే చేగువేరాతో క్యాస్ట్రో అనుబంధం చిరస్మరణీయమని పవన్ స్మరించుకున్నారు.