Begin typing your search above and press return to search.
లంచాలకు రసీదులిస్తారా లోకేష్?
By: Tupaki Desk | 5 April 2018 6:43 AM GMTముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అవినీతి ఉదంతం మలుపులు తిరుగుతోంది. ఆయనపై కొద్దికాలం క్రితం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ అవినీతి తారాస్థాయికి చేరిందని..ఆయన తాత అయిన దివంగత ఎన్టీఆర్ ఈ తీరును చూస్తే క్షోభిస్తారని పార్టీ ప్లీనరీ వేదికగా పవన్ వ్యాఖ్యానించారు. అనంతరం దీనిపై టీడీపీ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు నాలుగేళ్ల తర్వాత అవినీతి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించిన టీడీపీ నేతలు..తమ నాయకుడిని విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. లోకేష్ అవినీతికి ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
లోకేష్ అవినీతి ఎపిసోడ్‌పై ఒకింత గ్యాప్ తర్వాత తాజాగా స్పందించిన పవన్ కళ్యాణ్ తను చేసిన అవినీతి ఆరోపణలను సమర్థించుకున్నారు. `లోకేష్ అవినీతి అందరికీ తెలిసిందే...అందరి కళ్లముందు జరుగుతున్నదే.. ఈ విషయం ఎవరికి తెలియదు?` అంటూ తనను కలిసిన పలువురు వామపక్షాల నేతలతో పవన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. `అయినా...లంచం పుచ్చుకునేవారు రసీదులేమైనా ఇస్తారా… ఏంటీ?` అని పవన్ కల్యాణ్ వామపక్షాల నాయకులతో అన్నట్లుగా తెలుస్తోంది. లోకేష్ అవినీతి జగమెరిగినదేనని, తానేమీ ఆధారాల్లేకుండా ఆరోపించలేదని పవన్ కళ్యాణ్ అన్నట్లుగా సమాచారం. తమపై విమర్శలు చేసే బదులుగా అవినీతి జరుగుతున్న తీరుపై టీడీపీ నాయకులు స్పందించాలని - అలా జరగకుండా చూసి ప్రజలకు మేలు చేయాలని పవన్ అన్నట్లుగా సమాచారం.