Begin typing your search above and press return to search.
పవన్ న్యాయపోరాటం షురూ!
By: Tupaki Desk | 24 April 2018 8:44 AM GMTకొంతమంది మీడియా అధినేతలపై, కొన్ని మీడియా చానెళ్లపై ట్విట్టర్ వేదికగా జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. దాదాపుగా ట్విట్టర్ నే తన అనధికారిక మీడియా చానెల్ గా మార్చుకున్న పవన్....కెమెరామెన్ గంగతో రాంబాబు తరహాలో స్వయంగా రిపోర్టింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం టీవీ9 సీఈవో రవిప్రకాశ్ కు గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత వరుస ట్వీట్లతో పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, తనపై దుష్ప్రచారం చేసిన చానెళ్లపై పవన్ సంచలన ట్వీట్ చేశారు. టీడీపీ ప్రోద్బలంతో రెచ్చిపోయిన మీడియా చానెళ్లకు - వాటి అధిపతులకు లీగల్ నోటీసులు పంపబోతున్నామని పవన్ షాకింగ్ ట్వీట్ చేశారు.
తాను మీడియా చానెళ్లపై సుదీర్ఘమైన న్యాయపోరాటం చేయబోతున్నానని పవన్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే పవన్ సన్నద్ధమైనట్లు ఆయన తాజా ట్వీట్ ను బట్టి తెలుస్తోంది. తాజాగా, తనను టార్గెట్ చేసిన మీడియా చానెళ్లపై న్యాయపోరాటానికి దిగేందుకు పవన్ సిద్ధమయ్యారు. తన సుదీర్ఘ న్యాయపోరాటానికి సంబంధించిన తొలి అడుగు వేసినట్లు పవన్ ట్వీట్ చేశారు. ``టీడీపీ అండ ఉన్న మీడియా చానెళ్ల అధిపతులకు, భాగస్వాములకు, పెట్టుబడిదారులకు, బోర్డుకు త్వరలోనే లీగల్ నోటీసులు పంపబోతున్నాం. వాటిపై స్పందించేందుకు వారికి తగినంత సమయం కూడా ఇస్తాం.`` అని పవన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్ ను బట్టి తనపై విష ప్రచారం చేసిన కొన్ని మీడియా చానెళ్లపై లీగల్ ఫైట్ చేసేందుకు పవన్ రెడీ అయినట్లు కనిపిస్తోంది.
అంతకుముందు, తనకు టీవీ9 శ్రీనిరాజు తరపు న్యాయవాది లీగల్ నోటీసులు పంపడం పై పవన్ సుదీర్ఘ లేఖతో జవాబిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ రోజు పవన్ మరిన్ని ఆసక్తికర ట్వీట్లు చేశారు. 6 నెలలుగా తనపై జరుగుతోన్న భావోద్వేగపు అత్యాచారంపై దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులను కోరనున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు - రాజకీయ నాయకులు - మీడియా పెద్దలు వారి పిల్లలు ఇలా అందరి పేర్లు బయటకు వస్తాయని పవన్ అన్నారు. సమాజంలోని పేరుకుపోయిన కుళ్లు బయటకు వస్తుందని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్రపన్నిన అందరి జాతకాలు బయటపడతాయని పవన్ అన్నారు. తన షో అన్ని షోలకన్నా ఎంతో రసవత్తరంగా ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు.