Begin typing your search above and press return to search.
రాధాకృష్ణ లైసెన్స్ ఇచ్చాడు... తిట్టండి:పీకే
By: Tupaki Desk | 24 April 2018 11:10 AM GMTగత 6 నెలలుగా తనను టార్గెట్ చేసుకొని దుష్ప్రచారం చేసిన కొన్ని మీడియా చానెళ్లపై, వాటి అధినేతలపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అండ ఉన్న మీడియా చానెళ్ల అధిపతులకు - భాగస్వాములకు - పెట్టుబడిదారులకు - బోర్డుకు త్వరలోనే లీగల్ నోటీసులు పంపబోతున్నామని ఈ రోజు పవన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్....తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ని శ్రీరెడ్డి అన్న మాట పెద్ద బూతేమి కాదని.. పల్లెటూళ్ళల్లో సాధారణంగా అనే మాటేనని ఆర్కే అన్న మాటలకు పవన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆర్కే చెప్పిన లాజిక్ ప్రకారం ఆయనను ఆ పదం ఉపయోగించి తిట్టవచ్చని.....అలా పిలిచినా ఆయనేం బాధపడడని అర్థం వచ్చేలా పవన్ షాకింగ్ ట్వీట్ చేశారు. ఒక సినిమాలోని సన్నివేశాన్ని ఉదహరించిన పవన్ ....ఆర్కేపై సంచలన ట్వీట్ చేశారు. ఒక సినిమాలో విలన్లు ఏం తప్పు చేసినా...ముంబైలో అంతే అన్న తరహాలో....ఆర్కే కూడా పల్లెటూళ్లో అంతే అని అన్నారని పవన్ ఎద్దేవా చేశారు. ఆ లాజిక్ ను బట్టి ఆర్కే ...ప్రజలందరికీ లైసెన్స్ ఇచ్చినట్లేనని, ఆర్కే ఇచ్చిన లైసెన్స్ ప్రకారం ఆయనను అలా తిట్టినా బాధపడడని అన్నారు. అంతేకాకుండా....బొంబైలో అంతే తరహాలో...పల్లెటూళ్లో అంతే....అని సర్ది చెప్పుకుంటాడని పవన్ ఘాటుగా విమర్శించారు. అయితే, ఆయన ఇచ్చిన లైసెన్స్ ఆయన వరకే పరిమితమవుతుందా....లేదా అనేది వేచి చూడాలని పవన్ అన్నారు.
అయితే, గత ఆదివారం నాడు తాను రాసిన ఓ ఎడిటోరియల్ లో పవన్ పై శ్రీరెడ్డి తిట్టిన ఆ పదాన్ని ఆర్కే విశ్లేషించారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ `బూతు`ను ఆర్కే విశ్లేషించడంతో పవన్ కు దొరికిపోయినట్లయింది. అప్పటి నుంచి ఆర్కేపై పవన్ తన దాడిని మరింత తీవ్రతరం చేశారని చెప్పవచ్చు. ఆ పదం యొక్క అర్థాన్ని ఆర్కే విశ్లేషిస్తూ , అలా అనడం పవన్ ని తిట్టినట్లని....పవన్ అమ్మగారిని తిట్టినట్లు కాదని ఆర్కే చెప్పడంతో పవన్ మండిపాడు మరింత ఎక్కువైంది. పవన్ ను శ్రీరెడ్డి దూఫించిన పదం జన సామాన్యంలో అత్యంత యథాలాపంగా ఉపయోగిస్తుంటారు అని ....అందులో తల్లులను నిందించడం ఉండదని ఆర్కే అనడం పవన్ క ఏమాత్రం నచ్చలేదు. దాంతోపాటు, అది అతి సాధారణంగా వాడే పదమని ఇప్పటికైనా పవన్ తెలుసుకుంటే మంచిదని అనడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది.
అయితే, ఇద్దరు సాధారణ వ్యక్తులు లేదా పరిచయస్థుల మధ్య...సరదాగానో కామెడీగానో ఆ మాటను ఉపయోగించినప్పటికీ...ఆ బూతు ...బూతు కాకుండా పోదు. అందులోనూ....ఇద్దరు అపరిచితుల మధ్య...పవన్ వంటి ఓ సెలబ్రిటీని...ఆయనకు ఏమాత్రం సంబంధం లేని శ్రీరెడ్డి తిట్టడం వేరు అన్న లాజిక్ ను చాలా మంది మిస్సయ్యారు. పవన్ ను శ్రీరెడ్డి ఆ పదంతో దూషించడం...కచ్చితంగా అసభ్యకరమైన తిట్టే అవుతుంది గానీ...సాధారణం కాదు. అందులోనూ పవన్ ను ఆ తిట్టు తిట్టేంతగా శ్రీరెడ్డిని బాధించడం గానీ....వ్యాఖ్యానించడం గానీ చేయలేదు. ఆ మాటకొస్తే...తనను క్యాస్టింగ్ కౌచ్ కు వాడుకున్నారు అని చెప్పిన వ్యక్తులపై ఫేస్బుక్ లో కానీ, లైవ్ లో కానీ శ్రీరెడ్డి ఆ పదం వాడలేదు. కేవలం ఓ సలహా ఇచ్చిన పవన్ ను ఆ పదంతో దూషించడం...దాని వెనుక వర్మ ఉండడం....అ పదానికి ఆర్కే పాజిటివ్ విశ్లేషణ ఇవ్వడం.....ఇవన్నీ పవన్ సీరియస్ గా తీసుకున్నారు ఆ బూతులో వాడిన పదాల కన్నా , వాటి అర్థాలకన్నా కూడా ..ఆ పదం వాడినవారి "ఇంటెన్షన్" ఏమిటి ? ఆ పదం వాడడం వెనుకనున్న "ఎమోషన్ " ఏమిటి అనేదే ముఖ్యమన్న లాజిక్ ను వర్మ కూడా మిస్సయ్యారు. అర్జున్ రెడ్డి సినిమా అని.....ఆ పదం సెన్సార్ అయిందని....లైవ్ లో శ్రీరెడ్డి ఆ పదం వాడిందని లాజిక్కుల వర్మ గుర్తించలేకపోయారు. అందుకే పవన్....ఆర్కే మాట్లాడిన లాజిక్ తోనే...ఆయనను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు.