Begin typing your search above and press return to search.
పవన్ సంచలన వ్యాఖ్య.. టీడీపీ లేనే లేదు.. జగన్ తోనే పోటీ!
By: Tupaki Desk | 2 April 2019 11:03 AM GMTఏపీలో రాజకీయం ఎంత హాట్ హాట్ గా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అధికార తెలుగుదేశం.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరగాల్సిన ముఖాముఖి పోటీని.. జనసేన అధినేత పవన్ ఎన్నికల బరిలోకి దిగటంతో పోటీ కాస్తా త్రిముఖంగా మారింది. తన ఘాటు వ్యాఖ్యలతో ఇప్పటికే వేడెక్కిస్తున్న పవన్.. తనను తప్పు పడుతున్న వారిపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.
టీడీపీ రహస్య స్నేహితుడిగా.. పార్టనర్ గా వస్తున్న విమర్శలపై ఘాటుగా రియాక్ట్ అయిన పవన్.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. అసలు టీడీపీ అన్నదే లేదంటూ జనసేనాని చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా గాజువాక.. భీమవరం రెండు నియోజకవర్గాల్లో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న పవన్.. ఒక మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇందులో ఆయన పలు అంశాలకు సమాధానాలు ఇచ్చారు. మిగిలివన్నీ ఎలా ఉన్నా.. తాను పోటీ పడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ తోనేనని.. తనకు జగన్ ప్రత్యర్థి అంటూ పవన్ స్పష్టం చేశారు. టీడీపీ అన్నది లేదని.. ఆ మాటకు వస్తే 2018 నుంచే తెలుగుదేశం పార్టీ లేదన్న ఆయన.. కేసీఆర్ టీడీపీ సైకిల్ చైన్ ను తెంపేశారన్నారు.
ఒకవైపు పవన్ ను టీడీపీ మద్దతుదారుగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు పేర్కొంటున్న వేళ.. అందుకు భిన్నంగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి పవన్ తన ఫోకస్ అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మీదనే పెట్టటం.. టీడీపీని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేసినా.. అవంత తీవ్రమైనవి కావు. ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యల పరమార్థం ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కావటం లేదు. పోటీనే లేదని చెప్పటం ద్వారా పవన్ ఎలాంటి సందేహం ఇచ్చారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన ఖాతాకు మళ్లించుకోవాలన్న వ్యూహంలో ఉన్న పవన్.. అందుకు తగగ్టలే పావులు కదుపుతున్నారు. టీడీపీని వ్యతిరేకించే వారు వైఎస్సార్ కాంగ్రెస్ కు వెళ్లకుండా మధ్యే మార్గంగా జనసేన ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం.. జగన్ కు మళ్లాల్సిన ఓటు తన ఖాతాలోకి తరలేలా ఆయన తాజా మాటలు ఉన్నాయని చెప్పాలి.
జగన్ ను ఉద్దేశించి మంట పుట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న పవన్.. పనిలో పనిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కడిగిపారేస్తున్నారు. ఇంతలా ఫైర్ అవుతున్న పవన్.. బాబు విషయంలో మాత్రం పెద్దగా విమర్శలు చేయటం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే.. బాబు పరువు పోయేలా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీనే లేదని.. కదలని సైకిల్ ను ఎంత అంటే మాత్రం ఉపయోగం ఏమిటంటూ పవన్ చెబుతున్న మాటలు టీడీపీ నేతల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి.
ఇప్పటివరకూ కేసీఆర్ ను.. జగన్ ను తిడుతున్న పవన్ తీరుతో తెలుగు తమ్ముళ్లు లోలోన ఖుషీగా ఉండగా.. తాజాగా పార్టీనే లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యతో వారు షాక్ తింటున్నారు. పవన్ చేసిన వ్యాఖ్య అనుకోకుండా చేసిందా? ఏదైనా లోతైన ఆలోచనతో చేసిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒక్క వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లలో అంతులేని కన్ఫ్యూజన్ కు పవన్ గురి చేశారని చెప్పక తప్పదు.