Begin typing your search above and press return to search.

జనసేన డుప్లికేట్ అభ్యర్థులు.. పవన్ సీరియస్

By:  Tupaki Desk   |   6 Jan 2019 8:13 AM GMT
జనసేన డుప్లికేట్ అభ్యర్థులు.. పవన్ సీరియస్
X
జనసేనతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆయన ప్రత్యర్థులు , వ్యతిరేకులు చుక్కలు చూపిస్తున్నాడు. నాడు చిరంజీవి ప్రజారాజ్యంపై కుట్రలు చేసినట్టే నేడు జనసేనను కూడా కొందరు చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ సంతకం, ఆ పార్టీ లెటర్ హెడ్ ను ఫోర్జరీ చేసి కొందరు సీట్లను కూడా పంచేసుకోవడం తాజాగా కలకలం రేపింది . ఈ సంఘటనతో ఆయా చోట్ల టికెట్లు ఆశిస్తున్న నేతలు అవాక్కయ్యారు. జనసేనాని తమను మోసం చేశాడా అని వాపోయారు. కానీ ఇదంతా కొందరు కుట్రపూరితంగా చేశారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా దీనిపై న్యాయపోరాటానికి పవన్ సిద్ధమయ్యారు.

జనసేన అధినేత పవన్ కళ్యాన్ సంతకంతో ఉన్న జనసేన నకిలీ లెటర్ ప్యాడ్ లు రెండు రోజులుగా సోషల్ మీడియా, నెట్ లో వైరల్ గా మారుతున్నారు. జనసేన నుంచి బెజవాడలో పలువురికి టికెట్లు ఇస్తున్నట్టు ఆ లెటర్ హెడ్ లలో ఉంది. ఆ నకిలీ లెటర్ హెడ్ లు వైరల్ కావడంతో పవన్ కళ్యాన్ సీరియస్ అయ్యారు. దీనిపై రేపు పార్టీ లీగల్ సెల్ నేతల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.

ఆ నకిలీ లెటర్ ప్యాడ్ లో విజయవాడ సెంట్రల్ నుంచి జనసేన శాసనసభ అభ్యర్థిగా కొంగటి సత్యం, తూర్పు శాసనసభ అభ్యర్థిగా పోతిన మహేష్, పశ్చిమ శాసనసభ అభ్యర్థిగా కొరడా విజయ కుమార్ గారిని ఖరారు చేశామని.. వారిని గెలిపించాలని.. పవన్ సంతకంతో జనసేన లోగోతో ఉంది. ఇది నకిలీ అని తేలడంతో జనసేన, పవన్ స్పందించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

అంతేకాదు జనసేన పార్టీ దీనిపై ట్విట్టర్, ఫేస్ బుక్ లో స్పందించింది. విజయవాడ నగర పరిధిలోని సీట్లను కొందరికీ కేటాయించినట్టు వస్తున్న వార్తలు నిజం కావని.. కొందరు కుట్రపూరితంగా చేశారని.. ఏదైనా సరే పార్టీయే అభ్యర్థులను విడుదల చేస్తుందని.. ఇంతవరకు జనసేన అభ్యర్థులను ఖరారు చేయలేదని పేర్కొన్నారు. ప్రజలు, జనసైనికులు దీన్ని గమనించాలని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది.

గతంలోనూ ఇలానే పవన్ కళ్యాన్ ఎలాంటి ప్రకటనలు చేయయముందే ఓ అభ్యర్థిని ప్రకటించినట్టు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు కూడా ఎవరో కావాలనే ఇలా చేశారు. దీంతో దీనిపై జనసైనికులు సీరియస్ గా ఉన్నారు. జనసేనను నీరుగార్చాలనే ఇలా చేస్తున్నారని అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.దీని వెనుక ఎవరున్నారనే విషయంలో ఆరా తీస్తున్నారు.