Begin typing your search above and press return to search.

రెండు కళ్లే కాదు..రెండు నాల్కలు 'దేశాని' వే..!!!

By:  Tupaki Desk   |   21 July 2018 4:47 PM GMT
రెండు కళ్లే కాదు..రెండు నాల్కలు దేశాని వే..!!!
X
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి - ఆ పార్టీ ప్రజాప్రతినిధులు - మంత్రులు - సీనియర్ నాయకులది ఒకటే మాట. వారంతా తూ.చా తప్పకుండా ఒకే పద్దతిని.. విధానాలను పాటిస్తారనడానికి లోక్‌ సభలో అవిశ్వానం తీర్మానంపై జరిగిన చర్చే తార్కాణం. తెలంగాణ ఉద్యమ సమయంలో తనది రెండు కళ్ల సిద్ధాంతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రకటించారు. అప్పటి ఆ ప్రకటనకు కొత్తగా మరో అంశం కూడా చేరింది. అదే రెండు నాల్కల ధోరణి... రెండు నాల్కల పద్దతి... రెండు నాల్కల విధానం. ఈ పద్దతి... ధోరణి... ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరూ పాటిస్తున్నారు.

లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గుంటూరు లోక్‌ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ప్రత్యేక హాదాపై రెట్టించిన ఉత్సాహంతోనూ.... ఆవేశంతోనూ ప్రసంగించారు. అయితే ఈ ఆవేశకావేశాల్లో ఆయనకి అసలు విషయం గుర్తు లేనట్లు ఉంది. ఏం లేదు... అదే గతంలో ఓసారి ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విషయంలో లోక్‌ సభలో చర్చకు వచ్చిన సందర్భంలో హోదా కంటే ప్యాకేజీయే మిన్న అని లోక్‌ సభ సమావేశాలు జరిగే హాలు దద్దరిల్లిపోయినట్లుగా గల్లా జయదేవ్ ప్రసంగించారు. ఈ విషయం గుర్తు లేదని కొందరంటూంటే మరికొందరు మాత్రం " అబ్బే గుర్తు లేకపోవడం కాదండీ. వారిది రెండు కళ్లు... రెండు నాల్కల విధానం కదా అంటున్నారు. అవిశ్వాసంపై లోక్‌ సభలో చర్చ జరిగే సమయంలో ఒక్క గల్లా జయదేవ్ మాత్రమే కాదు.... తెలుగుదేశం సభ్యులందరూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రస్తావించారు. అంతే కాదు.... గడచిన మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రెండు నాల్కల ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ట్విట్ చేశారు. ఈ ట్విట్‌ లో " ఆంధ్రప్రదేశ్ అంటే 175 మంది ఎమ్మెల్యేలు - 25 మంది ఎంపీలు మాత్రమే కాదు. ఐదు కోట్ల ప్రజలు" అని మండిపడ్డారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే జనసైనికుడు పవన్ కల్యాణ్‌ కి కూడా రెండు నాల్కలు - రెండు కళ్లు.... రెండు ఆలోచనలు... రెండుకు మించిన పెళ్లిళ్లు ఉండడమే.