Begin typing your search above and press return to search.
ఏపీ రాజధానిపై పవన్ కళ్యాణ్ నిశ్శబ్దం.. అమరావతి రైతుల ఆగ్రహం
By: Tupaki Desk | 10 Sep 2020 5:38 PM GMTఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్ణయించడంలో తమకు పాత్ర లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టులో అఫిడవిట్ సమర్పించి మరీ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయానికి కేంద్రం ఓకే చెప్పినట్టు అయ్యింది. ఇప్పటికే కేంద్రం ఈ విషయలో మూడో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టాన్ని అర్ధం చేసుకోవడంలో పిటిషనర్లు అయిన రైతులు అపోహ పడుతున్నట్లు కేంద్రం తెలిపింది. అదే సమయంలో హైకోర్టు రాజధానిలోనే ఉండాలని చేస్తున్న వాదనలోనూ అర్ధం లేదని తెలిపింది.
రాజధానుల్లో కేంద్రం పాత్రపై హోంశాఖ మరింత స్పష్టత ఇచ్చింది. హైకోర్టు ఉంది కాబట్టి అమరావతే రాజధాని అనుకోవడానికి లేదని కూడా కేంద్రం ఈ అఫిడవిట్లో క్లారిటీ ఇచ్చింది. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు రాజధానిలో ఉండాలని ఎక్కడా లేదని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. హైకోర్టు మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయాధికారం అని కేంద్రం చెప్పినట్లైంది. అంతకుముందు అమరావతికి పూర్తి మద్దతునిచ్చిన బిజెపి.. ఇప్పుడు ఫ్లేటు ఫిరాయించి ద్రోహం చేస్తోందని అమరావతి రైతులు మండిపడుతున్నారు.
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. రాజధానికి ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని చెప్పింది. చట్టంలో రాజధాని ఎంపిక అని మాత్రమే ఉందని.. ఒకే రాజధాని అని మాత్రం కాదని కేంద్రం చెప్పింది. ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉంటే సాయం చేయబోమని తామెక్కడా చెప్పలేదని కేంద్రం తాజా అఫిడవిట్లో పేర్కొంది. దీంతో మూడు రాజధానులకు కేంద్రం అమోదముద్ర వేసినట్టేనని తెలుస్తోంది.
అయితే ఏపీ రాజధాని మార్పు విషయంలో ఇటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్ష టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే అందరూ తలో మాట అంటున్నా.. ఏపీ రాజధానిపై పవన్ కళ్యాణ్ నిశ్శబ్దం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.. మూడు రాజధానులను ఆపడానికి బిజెపితో పొత్తు పెట్టుకుంటానని పవన్ కళ్యాణ్ గతంలో పేర్కొన్నారు. అమరావతి.. రైతుల గొంతును వినిపిస్తానని.. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానన్నారు. కానీ ఇప్పుడు హైకోర్టు సాక్షిగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో కేంద్రం చేతులు కలిపినప్పుడు పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకుని ఉండడంపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు.
"పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుండి తన సొంత ఆలోచనను ఆపివేసాడు. బిజెపి ఎజెండాను ఆయన భుజాలపై వేసుకుంటున్నారు. అంథర్వేదిలో ఒక రథాన్ని దగ్ధం చేస్తే ఖండిస్తూ ఆయన ఈ రోజు ధర్మ పరిరక్షనా దీక్ష చేస్తున్నారు, కానీ అమరావతి రైతుల దుస్థితి గురించి మాట్లాడటానికి పవన్ కు సమయం లేదు. పవన్ కళ్ళు, చెవులు మూసుకున్నాడా? ” అని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు.