Begin typing your search above and press return to search.
జై తెలంగాణ అంటూ పవన్ స్పీచ్ ఏమంటే..?
By: Tupaki Desk | 23 Jan 2018 11:52 AM GMTతెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. కరీంనగర్.. నిజామాబాద్.. అదిలాబాద్ జిల్లాల కార్యకర్తలతో సమావేశమైన నేపథ్యంలో పవన్ ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తనప్రసంగాన్ని స్టార్ట్ చేసిన పవన్ మాటకు అక్కడి వారు పెద్ద ఎత్తున స్పందించారు. పవన్ ఏం మాట్లాడారంటే..
+ జై తెలంగాణ అంటే ఒళ్లు పులకరిస్తుంది. వందేమాతరం లాంటి నినాదమే జై తెలంగాణ
+ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిబద్ధత - బాధ్యతతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఏపీ నాకు జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మను ఇచ్చింది. తెలంగాణ నేల తల్లికి ఆఖరి శ్వాస వరకు రుణపడి ఉంటా.
+ పుట్టింది ఆంధ్రాలో అయినా.. పెరిగింది ఎక్కువగా ఎక్కువగా తెలంగాణలోనే. తెలంగాణ భావోద్వేగం నాలో ఉంది కనుకే.. తెలంగాణ అంటే చాలా ఇష్టం.. ప్రేమ.. ప్రాణం కూడా. తెలంగాణ యాస, భాష, సంస్కృతిని నా సినిమాల్లో ప్రోత్సహిస్తా. సంస్కృతికి గౌరవం ఇవ్వకపోతే ఎవరికైనా బాధ కలుగుతుంది. తెలంగాణ యాస, భాషను గౌరవించి ఉనికిని బలంగా చాటి చెప్పాలి. బతుకమ్మ - సమ్మక్క సారలమ్మ - సదరు ఉత్సవాలను కాపాడుకోవాలి.
+ ఆంధ్రా, తెలంగాణ వేరు కాదు.. దేశం కోసమే నా తాపత్రయం. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై ఉంది. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధం. సమస్యలు తెలియజేస్తా.. పరిష్కారం చూపిస్తా. అవినీతి లేని సమాజం కోసం యువత సిద్ధం కావాలి.
+ ఏ పార్టీలైనా సిద్ధాంతాలు లేకుండా ముందుకు వెళ్లలేవు... జనసేన పార్టీ సిద్ధాంతాల్ని ఏడుగా విభజించాం. కులాలను కలిపే ఆలోచనా విధానం అనేది పార్టీ సిద్ధాంతం. ఏ ఒక్కరితో శతృత్వం పెట్టుకోదలుచుకోలేదు.
+ జనసేన పార్టీపై ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తున్నారు. అసలు జనసేన పార్టీ ఉంటుందా? విలీనం చేస్తారా? అని అడుగుతున్నారు.
+ మడమ తిప్పే మనిషిని కాదు. మాట ఇస్తే తిరిగి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జనసేనను వేరే పార్టీలో విలీనం చేయాల్సి వస్తే నేను మీ ముందు ఎలా ఉంటాను. 2019లో తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుంది.
+ తెలంగాణ యువత - ఆడపడుచుల ఆకాంక్షే.. జనసేన ఆకాంక్ష. తెలంగాణ ఆశయాల కోసం జనసేన నిలబడుతుంది. నాకు అండగా ఉండండి. మీ కుటుంబంలో ఒకడిగా చూడండి. నాకు పునర్ జన్మ ఇచ్చిన తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.