Begin typing your search above and press return to search.

బస్సెక్కే ముందే పవన్ భారీ వ్యూహాలు?

By:  Tupaki Desk   |   16 Sep 2022 5:30 PM GMT
బస్సెక్కే ముందే పవన్ భారీ వ్యూహాలు?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయానికి ఇపుడు పదును పెడుతున్నారు. ఆయన 2019లో ఎందుకు ఓడానో బాగా గ్రహించారు. ఇక రానున్న ఏణ్ణర్ధం కాలంలో ఏపీ అంతా టూర్ చేయడం ద్వారా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకోవాలనుకుంటున్నరు. ఇక తాను బస్సు యాత్ర చేపట్టే జిల్లాలలో చేరికలు గట్టిగా ఉండాలని భారీ స్కెచ్ కి పవన్ గీసి పెట్టుకున్నారు. బస్సు యాత్ర అంటే మామూలుగా సాగదు, దానికి ఎంతో వ్యయ ప్రయాసలు ఉంటాయి. అలాగే అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా సాగాలీ అంటే లోకల్ గా గట్టి నేతలు ఉండాలి. అందుకే పవన్ చూపు ఇపుడు ఇతర పార్టీల మీద పడింది.

ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన్ని ప్రతీ రోజూ పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నాయకులు కలుస్తున్నారు. అలాగే కీలకమైన నాయకులు. జిల్లాల్లో పట్టున్న వారు, రాజకీయాలను శాసించేవారు అంతా కూడా పవన్ వైపు రావాలని చూస్తున్నారు. ఆయన సైతం ఇపుడు వారి అవసరం బాగా ఉంటుందని గుర్తెరిగి చేరదీస్తున్నారు.

ఆ విధంగా చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాలలో గట్టి నేతలు చాలా మంది జనసేనలో చేరికకు రెడీ అవుతున్నారు. వారంతా తమ ఇలాకాలలో స్ట్రాంగ్ లీడర్స్. ఇక వైసీపీలో చూస్తే ద్వితీయ శ్రేణి నేతలు చాలా మంది వైసీపీలో చేరాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే తరువాత తామే అంటూ చక్రం తిప్పే వారు ఇపుడు జనసేనలో తన లక్ ని చూసుకోవాలనుకుంటున్నారు. అలాగే ఒకనాడు మంత్రి పదవులు చేసి ఇపుడు ఖాళీ అయిన వారు కూడా ఉన్న పార్టీలో ఉక్కబోతలో జనసేన తీర్ధం పుచ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

ఈ విధంగా చూస్తే ఉత్తరాంధ్రాలో లిస్ట్ చాలా పెద్దదే కనిపిస్తోంది. అలాగే గోదావరి జిల్లాలో కూడా జనసేనలో టీడీపీ వైసీపీ నుంచి చేరికలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు వల్ల తమకు సీటు రాదని టీడీపీలో భావిస్తున్న వారు అటు నుంచి నరుక్కురావాలనుకుంటున్నారు. అలాగే వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వారు. సామాజిక సమీకరణలవల్ల ఈసారి గెలవలేమని భావిస్తున్న వారు కూడా జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు.

ఇలా ఉత్తరాంధ్రాతో మొదలుపెడితే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో జనసేనలో భారీ చేరికలు ఉండవచ్చు అని అంటున్నారు. బస్సెక్కి ఏపీ అంతా టూర్ చేయనున్న పవన్ కి కూడా ఈ చేరికలు ఇపుడు చాలా అవసరమని చెబుతున్నారు. తమ పార్టీలో జనాలలో ఆదరణ ఉందని చెప్పుకోవడానికి ఆయన ఫస్ట్ టైం జనసేన గేట్లు ఎత్తేయబోతున్నారు అని అంటున్నారు. దాంతో ఒక పద్ధతి ప్రకారం జనసేన గ్రాఫ్ పెంచేలా ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు.

పవన్ బస్సు యాత్ర ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో భారీ ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దాంతో జనాల్లో జనసేన మీద పొలిటికల్ గా భారీ ఇంపాక్ట్ పడుతుంది అని అంచనా కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల మీద ఇప్పటికైతే టీడీపీతో జనసేన సాగుతుంది అని చెబుతున్నా సీట్ల పంచాయతీ తేలాలి. దాంతో తమకు బలముంది అని చెప్పుకోవాలంటే ఇతర పార్టీల నుంచి చేరికలను ఆహ్వానించకతప్పదని జనసేన భావిస్తోంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే చాలా మంది పెద్ద నేతలను కూడా ఈ వైపుగా రప్పిస్తున్నారు అని అంటున్నారు. ఆయా నాయకులు చేరితే వారితో పాటే సీట్లూ కూడా వస్తాయన్నదే జనసేన లెక్క. అంటే రేపటి రోజున పొత్తులు కుదిరినా గౌరవప్రదంగా సీట్లు దక్కేలా జాగ్రత్తపడుతున్నారన్నమాట. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలకు ఇపుడు జనసేన గురి పెట్టింది. దాంతో ఆ పార్టీలకు ఇక చుక్కలే అని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.