Begin typing your search above and press return to search.
ఆ రెండు వ్యూహాలతో 'పవర్' స్టార్
By: Tupaki Desk | 25 Oct 2016 8:36 AM GMT వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా మారాలనుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2017 చివరి నాటికి తన సినిమా కమిట్ మెంట్లన్నీ పూర్తి చేసుకుని పూర్తిస్థాయిలో పాలిటిక్సులో దిగాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. తన రాజకీయ వ్యూహాన్ని కూడా పవన్ రెడీ చేసుకున్నారని... రాష్ట్రస్థాయి రాజకీయాలంటే ప్రతి అంశమూ కీలకమే అయినా... ప్రధానంగా ద్విముఖ వ్యూహంతో ఎన్నికలకు వెళ్లాలని పవన్ అనుకుంటున్నారని సమాచారం. పవన్ ఎంచుకున్న రెండు ప్రాధాన్యాంశాలూ అత్యంత పవర్ ఫుల్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రధానంగా యువతను నమ్ముకోబోతున్నారు. యువత మరింత పాత్ర పోషించేలా.. యువతతో కలిసి తాను ఎన్నికలకు వెళ్లేలా.. అడుగడుగునా యూత్ ఇన్వాల్వుమెంటు ఉండేలా పవన్ పక్కా ప్లాన్ రచిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు అవినీతి వ్యతిరేక విధానాలను కూడా బాగా పాపులర్ చేసి అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలన్న తన ధ్యేయాన్ని ప్రస్ఫుటంగా చెప్పడం కూడా పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
క్షేత్ర స్తాయిలో రాష్ట్రమంతా తిరిగి ప్రజలతో మమేకమవ్వాలన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. అంతకుముందు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను ఇన్వాల్వు చేస్తారని... తన పర్యటనల సమయంలోనూ వారే కీలకంగా ఉండేలా ప్రాధాన్యమిస్తారని చెబుతున్నారు. నవంబరు 10న అనంతపురం సభ తరువాత ఈ సభ్యత్వ నమోదు మొదలవబోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసేవారు కూడా ఎలాంటి అవినీతి మచ్చలేనివారైతేనే టిక్కెట్ ఇవ్వాలని.. అలాంటి వారు దొరకనప్పుడు ఆ స్థానాల్లో పోటీ మానుకుందామని పవన్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి పవన్ త్వరలో ఫుల్ టైం పొలిటికల్ సీన్లోకి రానున్నట్లు అర్థమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/