Begin typing your search above and press return to search.

రాజులంటే ప‌వ‌న్‌ కు అభిమాన‌మ‌ట‌..!

By:  Tupaki Desk   |   1 Jun 2018 4:55 AM GMT
రాజులంటే ప‌వ‌న్‌ కు అభిమాన‌మ‌ట‌..!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు కొన్ని చిత్రంగా.. మ‌రికొన్నిసార్లు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. త‌న‌ను తిట్టే వారిని సైతం పెద్ద మ‌న‌సుతో క్ష‌మించే త‌త్త్వం త‌న‌లో ట‌న్నులు ట‌న్నులు ఉన్న‌ట్లుగా ఆయ‌న మాట్లాడుతుంటారు. ప‌వ‌న్ ఎవ‌రు? అంటూ ఆ మ‌ధ్య‌న కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు అన్న మాట‌ల‌కు తాను అస్స‌లు ఫీల‌వ్వ‌లేద‌ని చెప్పి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

త‌న‌ను ఎట‌కారం చేసుకున్న రాజుగారిని ప‌వ‌న్ ఎందుకంత‌లా క్ష‌మించేశారంటే.. అందులో ఉండాల్సిన లెక్క‌లు ఉన్నాయి మ‌రి. త‌న‌ను తిట్టినోళ్ల‌ను.. త‌న‌ను అవ‌మానించేందుకు ప్ర‌య‌త్నించిన వారిని క్ష‌మించే పెద్ద మ‌న‌సు త‌న‌కు ఉంద‌ని.. తాను మిగిలిన రాజ‌కీయ నేత‌ల మాదిరి కాద‌న్న భావ‌న క‌లుగ‌జేయ‌టంతోపాటు.. రాజుగార్ల మ‌న‌సులు దోచుకోవ‌టానికే అన్న మాట వినిపిస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే వ‌ప‌న్ వ్యాఖ్య‌లు ఉన్నాయి. తాజాగా ప‌వ‌న్ చేస్తున్న పోరాట యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లాలో సాగుతోంది. ఈ సంద‌ర్భంగా త‌న‌పై అశోక్ గ‌జ‌ప‌తి రాజు చేసిన ఎట‌కారాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకున్న ప‌వ‌న్‌.. రాజులంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని.. రాజ‌రికాలు.. సంస్థానాలు ర‌ద్దు చేయ‌టం వ‌ల్లే ప్ర‌జాస్వామ్య రాష్ట్రాలు ఏర్ప‌డిన‌ట్లు చెప్పారు. వాటిని త్యాగం చేసిన వారంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని చెప్పారు. ఈ కార‌ణంతోనే విజ‌య‌న‌గ‌ర రాజుల వంశ‌స్థుడు అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు తాను తెలీద‌న్నా త‌న‌కు బాధ క‌ల‌గ‌లేద‌న్నారు.

దేశం స్వాతంత్య్రం సాధించిన త‌ర్వాత దేశంలోని రాజ‌రికాలు బంద్ చేయాల‌న్న నిర్ణ‌యం భార‌త ప్ర‌భుత్వం తీసుకున్న త‌ర్వాత‌.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో త‌మ రాజ‌రికాల్ని రాజులు వ‌దులుకున్నారే కానీ..తెల్లోడు మ‌న‌కి స్వాతంత్య్రం ఇచ్చిన వెంట‌నే రాజ సంస్థానాలు కూర్చొని త‌మ‌కు తామే రాజ‌రికాల్ని వ‌దులుకోనున్న‌ట్లు ప్ర‌క‌టిస్తే అదో ప‌ద్ధ‌తి. భార‌త స‌ర్కార్ ఆర్డ‌ర్ వేసిన త‌ర్వాత త‌మ రాజ‌రికాన్ని వ‌దులుకోవ‌టంలో త్యాగం ఏమిటో అర్థం కానిది. ఇలా అర్థం కాని అంశాలు ప‌వ‌న్ కు మాత్రం భ‌లేగా అర్థమ‌వుతూ ఉంటాయి. మ‌రి.. ప‌వ‌న్ అంటే అదేగా మ‌రి.