Begin typing your search above and press return to search.
జనసైనికులకు వార్నింగ్ ఇచ్చిన పవన్!
By: Tupaki Desk | 24 Sep 2018 6:53 AM GMTఇప్పటివరకూ తన ప్రత్యర్థులపైనా.. తనను అదే పనిగా టార్గెట్ చేసే వారిపైనా జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయటం.. సీరియస్ వార్నింగ్స్ ఇవ్వటం చూశాం. ఈసారి మాత్రం ఆయన తన పార్టీ అభిమానులకే వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది.
ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన నాయకులు కాలేమని.. కాస్త ఇగోలు తగ్గించుకొని పని చేస్తే అందరికి మంచిదన్న హితవు పలకటం గమనార్హం. నెల్లూరు రొట్టెల పండక్కి వచ్చిన ఆయన.. పార్టీ కార్యకర్తలతో ఒక హోటల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీటింగ్ లో ఒక మహిళా కార్యకర్త తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. పార్టీ కోసం పని చేసిన వారికి సరైన గుర్తింపు రావటం లేదని చెప్పారు.
పవన్ ఈ రోజు వస్తున్నారని చాలామంది హడావుడి చేశారని.. మిగిలిన సమయాల్లోపట్టించుకోవటం లేదని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక నాయకుల మీద అసహనంతోఉన్న పవన్.. ఈ ఉదంతంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన స్వరాన్ని పెంచి నాయకులను హెచ్చరించటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
ఎవరికి వారు ఇగోలతో పార్టీకి నష్టం చేయొద్దని చురకలు అంటించిన ఆయన.. అభిమానులు ఒక్కరితోనే ఏదీ కాదని.. అందరినిఆహ్వానించాలని.. కలుపుకుపోవాలని ఆయన చెప్పారు. అభిమానుల్ని కాస్త తగ్గాలన్న ఆయన.. తగ్గి అందరిని కలుపుకు వెళ్లి పని చేయాలి. అంతేకానీ ఇగోలతో విడిపోవద్దు.. పార్టీ నుంచి ఎవర్నీ విడదీయొద్దు.. అప్పుడే పార్టీ బాగుపడుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.పవన్.. ఉన్నట్లుండి ఇంత ఆగ్రహం ఎందుకబ్బా? ఇవే మాటల్ని కాస్త.. శాంతంగా చెప్పొచ్చుగా?