Begin typing your search above and press return to search.
మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి ..జగన్ కి పవన్ సూచన !
By: Tupaki Desk | 12 Nov 2019 12:43 PM GMTపవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతాడో మనకి కాదు కదా ఆయనకి కూడా తెలియదు. మాట్లాడుతున్న సందర్భంలో ఏది అనిపిస్తే అది అనేస్తారు. మళ్ళీ జనసేన కుల రాజకీయాల జోలికి వెళ్ళదు .. వ్యక్తిగత విమర్శలు నేను చేయను అని గొప్పలు చెప్పుకుంటారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి లాగా నేను వ్యక్తిగత విమర్శలు నేను చేయను ..ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు బాధపడతారు , నాకు బాగా వచ్చు , నేను అయన కంటే ఎక్కువగా తిట్టగలను ..ఏవి పవన్ చెప్పే మాటలు కానీ అవి చెప్పడానికి మాత్రమే పాటించడానికి కాదు. ఆయన పూర్తిగా వ్యక్తిగత విమర్శలే చేశారు.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ చదువులను పవన్ వంటి వాళ్లు వ్యతిరేకిస్తే, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అని జగన్ ప్రశ్నించారు. అయితే పవన్ అందుకు స్పందించలేదు. దానికి స్పందించి ఉంటె బాగుండేది. కానీ , మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు..అని తనను జగన్ అన్నారంటూ పవన్ వాపోయారు. ఈ నేపథ్యంలో పవన్ జగన్ కి ఇచ్చిన సూచన ఏమిటంటే 'జగన్ మోహన్ రెడ్డిగారూ మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి.. నేనేం సరదాగా చేసుకోలేదు' అంటూ పవన్ మాట్లాడారు. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉండివచ్చారంటూ పవన్ ధ్వజమెత్తారు. జగన్ తో పాటు విజయసాయి రెడ్డి కూడా జైల్లో ఉండివచ్చారంటూ విమర్శించారు. తను ఎప్పుడూ జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదని పవన్ చెప్పుకొచ్చారు. మరి కోడికత్తి పార్టీ, జగన్ జైలుకు వెళ్లారు, జగన్ జైలుకు వెళ్తారు.. అంటూ మాట్లాడిన మాటలను ఏమనాలో ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి. కొన్ని వేల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగత విమర్శలకి , రాజకీయ విమర్శలకి తేడా తెలియదా. అలాగే సీఎం జగన్ ను ఫ్యాక్షనిస్టు అని కూడా అన్నారు. ఇది వ్యక్తిగత విమర్శలాగా పవన్ కి అనిపించలేదేమో పాపం. అలాగే తెలంగాణలో ఉర్దూకలబోత తెలుగు మాట్లాడతారు అని , ఏపీలో జనాలకు పరిపూర్ణ తెలుగు మాట్లాడటం రాదు..అని ఈ సందర్భంగా తెలిపారు.