Begin typing your search above and press return to search.
పవన్!..శివాజీని మరిపిస్తున్నారుగా!
By: Tupaki Desk | 1 March 2019 4:13 AM GMTజనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు నిజంగానే సినీ నటుడు - ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న శివాజీని మరిపిస్తున్నారని చెప్పాలి. శివాజీ గరుడ పురాణాన్ని చెబితే.. పవన్ కల్యాణ్ ఇప్పుడు దానికి కొనసాగింపుగా గరుడ పురాణం అప్ డేటెడ్ వెర్షన్ గరుడ 2.ఓను చెబుతున్నట్లుగా ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు దక్షిణాదిపై కక్షకట్టిందని - గరుడ పేరిట రూపొందించిన వ్యూహాన్ని అమలు చేసి.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూలగొట్టేసి - దక్షిణాదిలో కూడా బలోపేతం అయ్యేందుకు పథకం రచించిందని నాడు శివాజీ సంచలన పురాణాన్ని వినిపించారు. ఈ పథకంలో భాగంగా ఎన్నికల ముందు విపక్ష నేతపై అపాయం లేని హత్యాయత్నం కూడా జరుగుతుందని శివాజీ చెప్పుకొచ్చారు. ఈ విషయాలన్నీ తనకు బీజేపీకి చెందిన ఓ ముఖ్య నేత చెప్పారని - ఆయన పేరును తాను వెల్లడించలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ చెప్పినట్లుగానే విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగగా... శివాజీ మాత్రం అడ్రెస్ లేకుండా పోయారు.
తాజాగా పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు శివాజీ తరహాలో మరో గరుడ పురాణాన్ని వినిపించారు. ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న పవన్... నేడు కడప జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ - భారత్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వైనంపై స్పందించిన పవన్.. భారత పైలట్ ను పాక్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాత తన 2.ఓ గరుడ పురాణాన్ని విప్పిన పవన్... సరిగ్గా ఎన్నికలకు ముందు పాక్ తో యుద్ధం జరిగే దాకా పరిస్థితి వెళుతుందని రెండేళ్ల క్రితం నాడు తనకు బీజేపీ నేతలు చెప్పారని వివరించారు.
పవన్ 2.ఓ గరుడ పురాణం ఎలా సాగిందన్న విషయానికి వస్తే.. *దేశభక్తి కేవలం భాజపాకే ఉన్నట్లు ప్రవర్తిస్తోంది. వారికంటే పదిరెట్లు ఎక్కువ మనకూ ఉంది. సరిహద్దుల్లో యుద్ధానికి తెరతీశారు. యుద్ధం రాబోతోందని నాకు రెండేళ్ల క్రితమే చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో మన దేశం ఉందో దీనిని బట్టే మీరు అర్థంచేసుకోవచ్చు. ముస్లింలు దేశభక్తి నిరూపించుకోవాల్సిన అవసరంలేదు. హిందువులకు ఈ దేశంలో ఎంత హక్కు ఉందో ముస్లింలకు కూడా అంతే ఉంది. అన్ని మత ధర్మాలను కాపాడేది మన భారతదేశం. పాకిస్థాన్ లో ఉన్న హిందువులకు ఎంత స్థానం ఇస్తారో నాకు తెలీదు కానీ భారతదేశం ముస్లింను గుండెల్లో పెట్టుకుంటుంది. రాయలసీమ యువతలో నేను బలమైన మార్పు కోరుకుంటున్నాను. ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన జయప్రకాశ్ నారాయణ్ ను ఉండనివ్వలేదు. ఎంతో చేద్దామని వచ్చిన చిరంజీవికి సాధ్యపడనివ్వలేదు. పోతే ప్రాణాలు పోవాలి కానీ నేనైతే ఆశయాలను చంపుకోను* అంటూ పవన్ తనదైన శైలి గరుడ పురాణాన్ని వినిపించారు.