Begin typing your search above and press return to search.
తన సినిమా లో విలన్ లా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ !?
By: Tupaki Desk | 25 Nov 2019 7:57 AM GMTఅన్ని రాజకీయాలూ అయిపోయాయి.. ఆఖరికి మత రాజకీయాన్ని నమ్ముకుంటున్నట్టుగా ఉన్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. తను కుల రాజకీయాలు చేయనంటూ ఎక్కువగా కులం గురించి మాట్లాడిన నేతగా నిలిచారు పవన్ కల్యాణ్. తను కాపుల ఓట్లను క్యాష్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదంటూ.. రాష్ట్రంలో కాపుల జనసంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు.
తన పార్టీ అభ్యర్థుల తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేసింది కూడా కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే. కాపుల ప్రభావం ఉండదనే చోట పవన్ కల్యాణ్ అసలు ఎన్నికల సమయం లో కూడా ప్రచారం చేయలేదు. అదీ పవన్ కల్యాణ్ కుల రాజకీయం.
అయితే తను కుల రాజకీయం చేయనని పవన్ తరచూ చెబుతూ ఉంటారు. అయితే అంత జేసినా పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యే గా నెగ్గ లేకపోయారు. కాపుల నియోజకవర్గాల్లోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇక తాజాగా పవన్ కల్యాణ్ మతపరమైన అంశాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. జెరుసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం పెంచడాన్ని పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. అంతటితో ఆగలేదు. హిందూ దేవాలయాల నుంచి టాక్సులు వసూలు చేస్తున్నారని, చర్చిలు పన్నులు కట్టడం లేదని పవన్ అంటున్నారు.
ఇలా మతాల పరమైన తేడాలను హైలెట్ చేస్తూ పవన్ మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుల ఓట్లు కావాలనుకున్నప్పుడు తన మూడో భార్య, తన పిల్లలు క్రైస్తవులు అని ప్రకటించుకునే పవన్ కల్యాణ్ ఇప్పుడు హిందూ రాజకీయం చేయాలని ఇలా మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు.
అయితే పవన్ కల్యాణ్ కు అవగాహన లేక పోవచ్చు కానీ..జెరుసలేంకు వెళ్లే క్రైస్తవులకు డబ్బులు ఇవ్వడం అనేది చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభం అయిన వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ హయాం లో, చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో ఆ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు. అప్పుడు పవన్ మాట్లాడలేదు.
మరింత కామెడీ ఏమిటంటే.. చంద్రబాబు హయాం లో ఆ మొత్తాన్ని పెంచారు. అప్పుడు పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి అప్పుడు వ్యతిరేకించలేదు. ఇప్పుడు జగన్ హయాంలో అందుకు సంబంధించి సవరణ చేయగా.. మత రాజకీయం చేయాలని పవన్ కల్యాణ్ తాపత్రయపడుతూ ఉన్నట్టున్నాడు.
ఇదంతా ఎలా ఉందంటే.. పవన్ కల్యాణ్ తనే హీరో గా నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ పాత్ర ప్రాంతీయ-మత రాజకీయం చేయాలని చూస్తుంది. అందుకోసం రకరకాల లాజిక్కులు మాట్లాడుతుంది. ఆ తరహాలో పవన్ కల్యాణ్ కూడా విద్వేష రాజకీయాలను రేపాలని చూస్తున్నట్టుగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు.