Begin typing your search above and press return to search.
పవన్ పై కుట్ర...ఓ జర్నలిస్టు వీడియో వైరల్!
By: Tupaki Desk | 16 April 2018 2:50 PM GMTజనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ పై కొంతకాలంగా ఇటు రాజకీయ పరంగా - అటు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొంతమంది విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పై వస్తున్న వ్యాఖ్యలను విశ్లేషిస్తూ ఓ సీనియర్ జర్నలిస్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలనే పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు కుట్రపన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కుట్రలు - కుతంత్రాలతో కూడా రాజకీయంలో ఎదురుదాడి వ్యూహాన్ని అనుసరించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో పవన్ కల్యాణ్ ను ఉదాహరణగా తీసుకోవచ్చని చెప్పారు. పవన్ ను వ్యక్తిగతంగా...ముఖ్యంగా ఆయన పెళ్లిళ్ల విషయంలో టార్గెట్ చేయడం క్రమక్రమంగా పెరుగుతోందని అన్నారు. పవన్ చేసుకున్న పెళ్లిళ్లు ఆయన వ్యక్తిగతమని - ఆయన పెళ్లి చేసుకున్నట్లు సమాజం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అయితే, తమతో పవన్ కలిసున్నంత కాలం పల్లెత్తు మాట అనని పార్టీలు కూడా నేడు పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో వారు తెర వెనుక ఉండి పవన్ పై విమర్శలు చేయిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో పవన్ ను వ్యక్తిగతంగా మరింత టార్గెట్ చేస్తారని అన్నారు. ఆ జర్నలిస్టు యూట్యూబ్ లో పెట్టిన విశ్లేషణ వీడియోలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ప్రత్యేకించి టాలీవుడ్ లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ చర్చలో...పవన్ కల్యాణ్ పేరు తీసుకువచ్చారని, ఆయనకు ఓటువేయొద్దని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన హీరోలా వ్యవహరించడం లేదని కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలు చేస్తున్న మహిళలు....పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేశారా అని ఆయన ప్రశ్నించారు. చాన్స్ ల కోసం ఎంతకన్నా దిగజారుతామని - ఆ తర్వాత వేలెత్తి చూపితే ఆవేదన చెందుతామని అనడం సరికాదన్నారు. ఏ రంగంలోనైనా మహిళలపై లైంగిక వేధింపులనేవి....తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అంశమని అన్నారు. కానీ, దానిని ఒక పాయింట్ గా తీసుకుని పవన్ ను టార్గెట్ చేయడం సరికాదన్నారు. శ్రీరెడ్డి అంశంపై పవన్ స్పందించారని - తానేమీ లాయర్...జడ్జి కాదని....న్యాయం కోసం పోలీస్ స్టేషన్ - కోర్టుకు వెళ్లండి అని ఆయన సూచించడం ఆయన అభిప్రాయమని అన్నారు. దానిని కూడా కొంతమంది టార్గెట్ చేసి విమర్శించడం సరికాదని అన్నారు. రాజకీయంగా పవన్ ను ఎదుర్కోలేక...ఆయన వ్యక్తిత్వ హననం చేయడం మొదలు పెట్టారని...దానిని పవన్ , ఆయన ఫ్యాన్స్ ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో కోసం క్లిక్ చేయండి