Begin typing your search above and press return to search.
పవన్ టార్గెట్ జగనా..బీజేపీనా.. ?
By: Tupaki Desk | 5 Dec 2019 8:03 AM GMTపవన్ కళ్యాణ్ ..జనసేన అధినేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈయన ..ఏపీ రాజకీయాలలో కీలకంగా మారతారు అని అందరూ అనుకుంటే .. ఈయన కూడా రాజకీయాన్ని బాగా వంట పట్టించుకున్నట్టు అర్థమౌతుంది. గత కొన్ని రోజులుగా పవన్ మాట్లాడే తీరు - అయన వ్యవహార శైలి చూస్తుంటే పవన్ చాలా త్వరగా రాజకీయ నాయకుడిగా మారిపోయారు అని అనిపించకమానదు. కానీ , అయన ఆవేశం మాత్రం కొంచెం తగ్గించుకోవాలి ..అది సినిమాలకి పనికి వస్తుంది. రాజకీయాలకి కాదు. అదే ఆవేశం ఇప్పుడు పవన్ ని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది.
పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదు. తాజాగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయగా .. ఆ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా అయ్యాయి. మతపరంగా జగన్ ను టార్గెట్ చేయబోయి - తానే ఇరకాటంలో పడ్డారా? అంటే అవుననే చెప్పాలి. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పమయ్యాయి. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని - ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనితో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ - ఆరెస్సెస్ - వీహెచ్ పీ నేతలకి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తుంది.
జగన్ టార్గెట్ చేయబోయే మిస్ ఫైర్ అవ్వడం తో ఇప్పుడు బీజేపీ నేతలు పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఎన్నికలైన తర్వాత, కొన్నాళ్లు జగన్ ప్రభుత్వంపై విధానపరమైన విమర్శలు చేసిన పవన్ - ఈమధ్య జగన్ కులం - మతం గురించి కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. అసలు జగన్ కులం - మతం గురించి పవన్ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏమైనా పెద్ద ప్లాన్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నారు.
సీఎం జగన్ ని ఏదో అనబోయి - ఏదో అర్థమయ్యేలా చెప్పబోయి పవన్ ఇలా అన్నారా...లేదంటే మనసులో వున్నదే మాట్లాడారా అన్నది ఎవరికీ అర్థంకావడం లేదు. చివరికి జనసేన నాయకులకు కూడా పవన్ వ్యాఖ్యలను ఎలా సమర్థించాలో కూడా బోధపడ్డంలేదట. హిందూధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన పవన్ పై - నిరసన వ్యక్తం చేశారు. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ రేంజ్ లో ఫైరయ్యారు. పవన్ టార్గెట్ జగనా - బీజేపీనా అన్నది ప్రస్తుతానికైతే ఎవరికీ బోధపడ్డం లేదు. కానీ పవన్ పై వరుసగా బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండటంతో - అనుకోకుండా బీజేపీకి-జనసేనకు వైరం పడినట్టయ్యింది. కానీ పవన్ టార్గెట్ మొత్తం జగనేనని తెలుస్తుంది.
ఇంగ్లీష్ మీడియం పై చర్చల సందర్భంలో పవన్ మూడు పెళ్లిళ్ల గురించి - సీఎం జగన్ ప్రస్తావించడంతో - పవన్ తీవ్రంగా హర్ట్ అయ్యారని - అప్పటి నుంచి జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కులం - మతంపై పవన్ చేస్తున్న వరుస వివాదాస్పద వ్యాఖ్యలు అజెండాలో భాగమా లేదా ఎదో అనబోయి ఎప్పటిలాగే మాట దొర్లిందా అన్నది ఒక్క పవన్ కె తెలియాలి.