Begin typing your search above and press return to search.
సింధు సిల్వర్ తెస్తే...వెంకయ్య ఏం తెచ్చారు
By: Tupaki Desk | 10 Sept 2016 10:30 AM ISTజనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన సీమాంధ్ర ఆత్మగౌరవ సభలో అందరికంటే ఎక్కువగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. వెంకయ్యను పవన్ ఫుట్‌బాల్ ఆడేసుకున్నారు. పవన్ తన ప్రసంగం స్టార్ట్ చేసిన వెంటనే వెంకయ్య పేరు ఎత్తారు. వెంకయ్య అంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉందంటూనే ఆయన్ను ఆటాడుకున్నారు.
మానవీయ వెంకయ్య జీ... మీరు..మీ బీజేపీ రెండు పాచిపోయిన లడ్డూలను మా చేతుల్లో పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం ? ఇక గతంలో జై ఆంధ్రా ఉద్యమంలో వెంకయ్య చేసిన ఉద్వేగ పూరిత ప్రసంగాల వల్ల ఎంతోమంది యువత రోడ్ల మీదకు వచ్చి చచ్చిపోయారని కూడా పవన్ తెలిపారు.
పవన్ వెంకయ్యను అక్కడితో వదలకుండా ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు వెంకయ్యకు లింకు పెట్టి మరీ వెంకయ్యపై సెటైర్లు వేయడం విశేషం. మన తెలుగమ్మాయి సింధు ఒలిపింక్స్‌లో రజత పతకం సాధించినందుకు మీరు నెల్లూరులో సన్మానం చేయాలనుకుంటున్నారు...సింధు మనకు ఒలిపింక్స్‌లో రజత పతకం తెచ్చి....మనదేశ ప్రతిష్టను పెంచింది. మరి మీరు తెలుగువారై ఉండి... కేంద్రంలో మంత్రిగా ఉండి ఏపీకి ఏం చేశారని ఆన్సర్‌లేని ప్రశ్నను వెంకయ్యకు సంధించారు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు వెంకయ్యనాయుడు అచ్చ తెలుగు భాషలో ప్రాసలతో కూడిన ప్రసంగాలు చేస్తూ తెలుగు ప్రజలను మెప్పిస్తారని..కానీ ఇప్పుడు హోదా విషయం అడిగితే ఆంగ్లంలో సమాధానాలు ఇస్తూ తప్పించుకుంటున్నారని పవన్ ఎద్దేవా చేశారు. ఓవరాల్‌గా తన ప్రసంగంలో వెంకయ్యనే ఎక్కువగా టార్గెట్ చేసిన పవన్ పీవీ సింధు రజత పతకానికి వెంకయ్యకు కూడా లింక్ పెట్టి మరీ వెంకయ్యను ఆడుకున్నారు.