Begin typing your search above and press return to search.
పవన్ పోటీ చేసే రెండో నియోజకవర్గం ఏది?
By: Tupaki Desk | 10 Nov 2017 3:30 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాన్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. పవన్ కేవలం అనంతపురం జిల్లా నుంచే కాకుండా రాష్ర్టంలోని మరో స్థానం నుంచి కూడా పోటీ చేస్తారన్న ప్రచారం, అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పార్టీ వర్గాల నుంచి కూడా ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ పోటీ చేయబోయే రెండో స్థానం గురించి చర్చించుకుంటున్నారు. కచ్చితంగా ఏ స్థానమన్నది చెప్పలేకపోయినా జిల్లాల గురించి అంచనాలు వెలువడుతున్నాయి.
పవన్ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడమన్నది దాదాపుగా కన్ఫర్మ్ కాగా రెండో స్థానం కోసం శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి కాపు సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న పశ్చిమగోదావరి నుంచి కూడా పోటీచేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ పవన్ నచ్చుకోలేదని టాక్. తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత పాలకొల్లు నుంచి పోటీ చేస్తే ఏమైందో తెలిసిన పవన్ పశ్చిమగోదావరిని కన్సిడర్ చేయడం లేదని తెలుస్తోంది.
తనకు పెద్ద సంఖ్యలో అభిమానులు, బలమైన అభిమాన సంఘాలు ఉన్న శ్రీకాకుళం జిల్లా కానీ, లేదంటే విద్యార్థి దశ నుంచి తనకు మంచి అనుబంధం ఉన్న నెల్లూరు జిల్లా నుంచి కానీ పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన శ్రీకాకుళం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాష్ర్ట రాజకీయాలను ప్రభావితం చేసే రెండు ప్రధాన సామాజిక వర్గాల డామినేషన్ అక్కడ లేకపోవడం.. కాపులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడం... ఇతర సామాజికవర్గాల్లోనూ తనకు అభిమానులు ఉండడంతో శ్రీకాకుళం జిల్లాలోని ఏదైనా నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.