Begin typing your search above and press return to search.
నా సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తా: పవన్ సంచలన ప్రకటన
By: Tupaki Desk | 12 Dec 2021 2:21 PM GMTఏపీలో ఆన్ లైన్ టికెట్ విధానం చేసి.. తన సినిమాలను ఆపేసి ఆర్థికంగా దెబ్బకొట్టాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని.. తన సినిమాలను ఆపేస్తే భయపడేంత పిరికివాడిని కాదని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంతానికి దిగితే తన సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లలో పారదర్శకత లేదన్నారు. ప్రభుత్వం చేసే మద్యం వ్యాపారంలో పారదర్శకత ఉందా? అని పవన్ ప్రశ్నించారు.
విశాఖ ఉక్కు కోసం దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీని పక్కనపెట్టి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, భూ నిర్వాసితులకు మద్దతుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసింది. పార్టీ నేతలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
రూ.700తో మద్యం తాగి రూ.5తో సినిమా టిక్కెట్ కొనుక్కొని వెళితే ప్రభుత్వానికి సంతోషంగా ఉంటుందా? అని పవన్ ఎద్దేవా చేశారు. అందరూ కలిసి వైసీపీ నేతలను చొక్కా పట్టుకొని నిలదీయకపోతే వాళ్లు మాట వినరు.. జనసేకు మద్దతిస్తే నేను చేసి చూపిస్తానని పవన్ అన్నారు. 2024 ఎన్నికల వరకూ వైసీపీ గుండాయిజం, బూతులు భరించాల్సిందే.. ఆలోచించి ఓటు వేయకపోతే విలువ తెలియకుండా అమ్ముకుంటే ప్రజల స్వయంకృతాపరాధమే అని పవన్ అన్నారు.
తన సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 2014లో ఓట్లు చీల్చకూడదనే తాను పోటీచేయలేదన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేంత వరకూ వైసీపీని భరించక తప్పదన్నారు.
సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడే జనసేన గుర్తొస్తుందని.. రేపు ఓసేటప్పుడు కూడా జనసేక గుర్తుకు రావాలని కోరుకుంటున్నట్టు పవన్ ప్రజలను విమర్శించడం విశేషం. ఏ ప్రతిఫళం ఆశించకుండా సర్వస్వం త్యాగం చేసిన మహనీయులే మనకు ప్రేరణ అన్నారు. పనిచేసే క్రమంలో పదవి రావాలని.. పదవి కోసం పనిచేయవద్దని సూచించారు.